Viral News: బాబోయ్.. ఆ దేశంలో భార్య బర్త్‌డేను భర్త మర్చిపోవడం చట్ట విరుద్ధమట.. పైగా ఈ నేరానికి ఐదేళ్ల జైలుశిక్ష కూడా..!
ABN , First Publish Date - 2023-11-16T13:23:34+05:30 IST
భర్త తన భార్య పుట్టిన రోజు(Birthday) ను మర్చిపోవడం కామన్‌గా జరిగే విషయమే. అయితే, సమోవా అనే దేశంలో మాత్రం ఇది చట్ట విరుద్ధమట. ఇలా భార్యల బర్త్‌డేలను మరిచిపోయే భర్తలకు అక్కడ జైలు శిక్ష తప్పదు.
Viral News: భర్త తన భార్య పుట్టిన రోజు(Birthday) ను మర్చిపోవడం కామన్‌గా జరిగే విషయమే. అయితే, సమోవా అనే దేశంలో మాత్రం ఇది చట్ట విరుద్ధమట. ఇలా భార్యల బర్త్‌డేలను మరిచిపోయే భర్తలకు అక్కడ జైలు శిక్ష తప్పదు. ఈ నేరానికి గాను అక్కడ ఏకంగా ఐదేళ్ల జైలు ఉంటుందట. ఈ దేశంలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం భార్య పుట్టిన రోజును మొదటిసారి మరిచిపోయే భర్తను కేవలం హెచ్చరికలతో వదిలేస్తారట. రెండోసారి కూడా ఇదే తప్పు చేస్తే.. ఆ భర్తకు గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.
Viral Video: నెట్టింట వైరల్ అవుతున్న వెరైటీ దోశ.. వీడియో చూస్తే నోరూరడం ఖాయం!
ఇక ఇలాంటి ఘటనలపై ఫిర్యాదుల కోసం అక్కడి పోలీసు వ్యవస్థలో ఓ ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. తమ బర్త్‌డేలను మరిచిపోయే భర్తలపై భార్యలు ఈ బృందం అధికారులకు ఫిర్యాదు చేస్తే చాలు. వారిపై వెంటనే చర్యలకు దిగుతారు అధికారులు. అంతేకాదండోయ్.. ఈ చట్టం గురించి భార్యలకు వివరించడానికి ప్రత్యేక అవగాహన క్యాంపులను సైతం అక్కడి ప్రభుత్వాధికారులు నిర్వహిస్తుండడం గమనార్హం. ఇక నెట్టింట వైరల్ అవుతున్న సమోవాలోని ఈ ప్రత్యేక చట్టం తాలూకు వార్తపై నెటిజన్లు 'ఇదెక్కడి ఇచ్చంత్రం..' అని కామెంట్ చేస్తున్నారు.