Viral Video: నెట్టింట వైరల్ అవుతున్న వెరైటీ దోశ.. వీడియో చూస్తే నోరూరడం ఖాయం!
ABN , First Publish Date - 2023-11-16T12:07:25+05:30 IST
నెటిజన్లు ఫుడ్ ఎక్స్ పరిమెంట్స్ (Food Experiments) తో వెరైటీ కాంబినేషన్‌లను ఇటీవల వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Viral Video: నెటిజన్లు ఫుడ్ ఎక్స్ పరిమెంట్స్ (Food Experiments) తో వెరైటీ కాంబినేషన్‌లను ఇటీవల వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో తాజాగా బ్లూ పీ దోశ (Blue Pea Dosa) నెట్టింట తెగ వైరలవుతోంది. దోశ పిండిలో నీలి బఠానీ పువ్వు రసాన్ని కలపడం ద్వారా తయారైన ఈ బ్లూ దోశ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. 'జ్యోతీస్ కిచెన్' (@jyotiz_kitchen) అనే ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఈ రీల్ పోస్ట్ కాగా, ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కొన్ని శంఖుపూలను మరిగించగా కొద్దిసేపటికి ఆ నీరు బ్లూ కలర్‌లోకి మారడం మనం చూడొచ్చు. ఆపై ఆ బ్లూ కలర్ నీటిని ఓ బౌల్‌లోకి తీసుకుని అందులో దోశ పిండిని కలిపారు. ఆ తర్వాత పెనంపై ఈ పిండిని వేసి బ్లూ దోశలను తయారుచేయడం కనిపిస్తుంది. ఇలా తయారైన వేడి వేడి దోశను వివిధ రకాల చట్నీలతో లాంగిచేయడం వీడియోలో ఉంది.
Elections: ఈ ఎన్నికల్లో గెలుపెవరిది..? భర్త కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మరో పార్టీ నుంచి అదే సీట్లో పోటీ చేస్తున్న భార్య..!
ఈ వీడియోకు ఇప్పటివరకు 10లక్షల కంటే ఎక్కువ వ్యూస్ రావడం గమనార్హం. అలాగే 28వేలకు పైగా లైక్స్ వచ్చి పడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 'మంచి ఆలోచన ఎందుకంటే నీలి బఠానీ పువ్వు నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిది', 'అది చాలా అందమైన రంగు', 'వావ్.. ఇది చాలా అద్భుతంగా ఉంది', 'ఎప్పుడూ ప్రయత్నించలేదు కానీ ఈ దోశ తప్పకుండా బాగుటుంది', 'దోశ మనిషిని మరింత క్లిష్టంగా మార్చివేస్తుందిగా' అని కామెంట్ చేశారు.