Viral Video: ఏం ట్యాలెంట్ బాసూ.. బైక్ ఇంజిన్, స్క్రాప్‌తో నాలుగు చక్రాల బండి.. కుర్రాళ్లపై నెటిజన్ల ప్రశంసలు!

ABN , First Publish Date - 2023-07-29T20:17:57+05:30 IST

మన దేశంలో కుర్రాళ్ల ప్రతిభకు కొదవలేదు. శూన్యం నుంచి అద్భుతాలను సృష్టించగల సత్తా మన వాళ్ల స్వంతం. చాలా తక్కువ ఖర్చుతో విలువైన వస్తువులను తయారు చేస్తున్న ఎంతో మందికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఏం ట్యాలెంట్ బాసూ.. బైక్ ఇంజిన్, స్క్రాప్‌తో నాలుగు చక్రాల బండి.. కుర్రాళ్లపై నెటిజన్ల ప్రశంసలు!

మన దేశంలో కుర్రాళ్ల ప్రతిభ (Talent)కు కొదవలేదు. శూన్యం నుంచి అద్భుతాలను సృష్టించగల సత్తా మన వాళ్ల స్వంతం. చాలా తక్కువ ఖర్చుతో విలువైన వస్తువులను తయారు చేస్తున్న ఎంతో మందికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి జుగాడ్ వీడియోల (Jugaad Videos)ను సామాన్యులే కాదు.. ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) వంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఇష్టపడుతున్నారు. వారిని అభినందిస్తున్నారు.

ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. Neeraj అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో కుర్రాళ్లు చాలా తక్కువ ఖర్చుతో ఓ నాలుగు చక్రాల వాహనాన్ని (Four wheeler) తయారు చేశారు. కేవలం బైక్ ఇంజన్ (Bike engine), స్క్రాప్‌తో కారు లాంటి వాహనాన్ని తయారు చేశారు. ఆ వాహనం మీద నలుగురు కూర్చుని హాయిగా ప్రయాణిస్తున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ కుర్రాళ్ల ప్రతిభను ప్రశంసిస్తున్నారు.

Viral: 8 నెలల పాప.. పొట్ట ఇలా ఉబ్బుతోందేంటని ఆస్పత్రికి తీసుకెళ్తే.. టెస్టులు చేసిన డాక్టర్లకే మైండ్‌బ్లాక్.. చివరకు..!

ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``వావ్.. పేదవాడి కారు. అద్భుతంగా ఉంది``, ``మనకు ట్యాలెంట్‌కు కొదవ లేదు``, ``అద్భుతమైన ఆలోచన``, ``మంచి ఇంజనీరింగ్ ప్రతిభ``, ``ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్లవచ్చు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-29T20:33:42+05:30 IST