Viral Video: పెళ్లిలో తాళి కట్టే ముందు వధువు చేయాల్సిన పనిని.. వరుడు చేయడంతో.. ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Dec 31 , 2023 | 08:50 PM
వివాహ కార్యక్రమాల్లో వధూవరుల మధ్య ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇవి కొన్నిసార్లు సీరియస్‌గా మారితే.. మరికొన్నిసార్లు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. వివాహానికి సంబంధించిన...
వివాహ కార్యక్రమాల్లో వధూవరుల మధ్య ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇవి కొన్నిసార్లు సీరియస్‌గా మారితే.. మరికొన్నిసార్లు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. వివాహానికి సంబంధించిన వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. పెళ్లిలో వధువు మెడలో తాళి కట్టే ముందు వరుడు చేసిన పని.. అందరికీ తెగ నవ్వు తెప్పించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తు్న్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) పీటలపై కూర్చుని ఉంటారు. దండలు మార్చుకున్న తర్వాత.. వివాహ క్రతువు కొనసాగుతూ ఉంటుంది. ఇంతో తాళి కట్టే సమయంలో రానే వచ్చింది. తాళిని చేతిలోకి తీసుకున్న వరుడు.. వధువు మెడలో కట్టబోతాడు. అయితే ఈ సమయంలో వారి ఎదురుగా ఉన్న పురోహితుడు.. తాళి కట్టేందుకు ఇబ్బంది లేకుండా పూలదండను వెనక్కు తీసుకోమని వధువుకు సలహా ఇస్తాడు. అయితే ఈ మాట విన్న వరుడు.. చెప్పింది తనకేనేమో అనుకుని.. దండలను దండను భుజంపై వేసుకుని తాళి కట్టబోతాడు.
Viral Video: శాంటాక్లాజ్ వేషధారిని వెంటపడి తరిమిన మేక.. అతడు చేసిన చిన్న పొరపాటుతో చివరికి..
వరుడు మళ్లీ తాళి కట్టే ముందు.. వెనుక ఉన్న మహిళ.. ‘‘చెప్పింది నీకు కాదు’’.. అంటూ మళ్లీ దండను ముందుకు వేస్తుంది. దీంతో తాను తొందరపడ్డానని తెలుసుకున్న వరుడు నాలుక్కరుచుకుంటాడు. ఈ ఘటనతో వధూవరులతో పాటూ అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తో్ంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లిలో తామూ ఇలాంటి పొరపాట్లు చేశాం’’.. అంటూ కొందరు, ‘‘వధూవరులకు ఇది మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: పెళ్లి పీటలపైనే వరుడికి షాకిచ్చిన వధువు.. సరదాగా మొదలై చివరకు ఏమైందో చూడండి..