Wedding Card: బాబోయ్.. ఈ వరుడు ఇలా చేశాడేంటి..? పెళ్లికార్డుపై ఉన్నదేంటో చదివి అవాక్కవుతున్న బంధువులు.. పెళ్లికి రావాలా..? వద్దా.. అంటూ..!

ABN , First Publish Date - 2023-04-22T11:42:28+05:30 IST

ఇటీవల సోషల్ మీడియాలో (Social Media) పెళ్లిల తాలూకు ఫొటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి.

Wedding Card: బాబోయ్.. ఈ వరుడు ఇలా చేశాడేంటి..? పెళ్లికార్డుపై ఉన్నదేంటో చదివి అవాక్కవుతున్న బంధువులు.. పెళ్లికి రావాలా..? వద్దా.. అంటూ..!

Wedding Card: ఇటీవల సోషల్ మీడియాలో (Social Media) పెళ్లిల తాలూకు ఫొటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. ఇదే కోవలో తాజాగా ఓ పెళ్లికార్డు (Wedding Card) ఫొటో కూడా నెట్టింట్ బాగా హల్‌చల్ చేస్తోంది. అయితే, అదేదో ప్రత్యేకమైన కార్డో లేక ఖరీదైనదో అనుకుంటే పొరబడినట్టే. అవును.. అందులో ఏ ప్రత్యేకత లేదు, అంతకుమించి అది అంతా ఖరీదైనది కూడా కాదు. కానీ, అందులో జరిగిన చిన్న అచ్చు తప్పు కారణంగా అది ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది. చిన్న తప్పు అంటే.. మరీ చిన్నదేమి కాదులేండి. ఆ తప్పు కారణంగా మొత్తం మీనింగ్ మారిపోయింది. పెళ్లిపత్రికపై ఉన్నదేంటో చదివి బంధువులు అవాక్కవుతున్నారు. పెళ్లికి వెళ్లాలా..? వద్దా..? అంటూ.. మీమాంసలో పడిపోయారు! ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డుపై నెటిజన్లు తమదైనశైలిలో జోకులు పేలుస్తున్నారు.

అసలు వెడ్డింగ్ కార్డులో జరిగిన అచ్చు తప్పు ఏంటంటే.. అన్ని పెళ్లిపత్రికలపై ఉన్నట్టే ఇందులో కూడా బంధువులు, మిత్రులకు ప్రేమ పూర్వక ఆహ్వానమే ఉంది. కానీ, ఆహ్వానం కోసం రాసిన రెండు లైన్లలో మొదటి లైన్ వరకు బాగానే ఉంది. రెండో లైన్ చివరికి వచ్చేసరి మొత్తం అర్థమే మారిపోయింది. అక్కడ జరిగిన చిన్న అచ్చు తప్పు కారణంగా బాబోయ్.. ఈ వరుడు (Groom) ఇలా చేశాడేంటి..? అసలు పెళ్లికి రావాలా..? వద్దా.. అంటూ..! జోకులు పేలుతున్నాయి. ఇంతకీ పెళ్లికార్డులోని చివరి లైన్‌లో ఏం రాసి ఉందో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వడం ఖాయం.

WC.jpg

Viral Video: పెళ్లి వేదిక మీదే బావను ఆటపట్టించాలనుకుందో మరదలు పిల్ల.. ఉప్పూ కారం కలిపిన నీళ్లను తెచ్చి డ్రింక్‌లా ఇవ్వబోయి..


'మరిచిపోకుండా మీరు మా పెళ్లికి రావాలి' అని ఉండాల్సిన చోట.. 'మీరు మా పెళ్లికి రావడం మరిచిపోండి' అని ఉంది. ఇది చూసిన బంధువులు అవాక్కవుతున్నారు. అసలు పెళ్లికి వెళ్లాలా..? వద్దా..? అని నవ్వుకుంటున్నారు. ఇక ఈ పెళ్లిపత్రిక కాస్త నెట్టింట దర్శనమివ్వడంతో నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 'ఇది చాలా పెద్ద అవమానం' అని ఒకరు,'ఈ కార్డు ప్రింట్ చేసినవాడు.. పెళ్లికి పిలిచినవారి మైండ్‌సెట్‌ను అర్థం చేసుకుని ఇలా ప్రింట్ చేసినట్టున్నాడు' అని మరొకరు కామెంట్ చేశారు.

Funny Video: వరుడు రెండు కొడితే.. వధువు నాలుగు తన్నింది.. బంధువులు ఆపుతున్నా ఆగకుండా పిచ్చి పిచ్చిగా తన్నుకున్నారు..!

Updated Date - 2023-04-22T11:45:29+05:30 IST