Gas Problem: కడుపంతా గ్యాస్ నిండిపోయి ఉబ్బరంగా ఉంటుందా? ఒక్కసారి ఇలా చేసి చూడండి..

ABN , First Publish Date - 2023-03-17T13:48:38+05:30 IST

జలుబు, దగ్గు వచ్చి తగ్గినట్టు ఈ సమస్య అంత సులువుగా తగ్గదని అనుకుంటారు. కానీ

Gas Problem: కడుపంతా గ్యాస్ నిండిపోయి ఉబ్బరంగా ఉంటుందా?  ఒక్కసారి ఇలా చేసి చూడండి..

ముద్ద నోట్లో పెట్టుకోగానే కడుపంతా నిండిపోయినట్టు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇంకాస్త తింటే పొట్ట ఎక్కడ పేలిపోతుందో అనే ఫీల్ కూడా ఉంటుంది. ఇక మావల్ల కాదు బాబోయ్ అని కొంచెం కూడా తినకుండానే కంచం ముందు నుండి లేచేస్తుంటారు. ఇది ఇప్పట్లో ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య. ఇదంతా గ్యాస్ ప్రాబ్లమని(Gas Problem) అందరికీ తెలుసు. జలుబు, దగ్గు వచ్చి తగ్గినట్టు ఈ సమస్య అంత సులువుగా తగ్గదని అనుకుంటారు. కానీ ఈ ఒక్క చిట్కా పాటిస్తే ఎంతో వేధించే ఈ సమస్యను కూడా సులువుగా తరిమికొట్టవచ్చు.

గ్యాస్ సమస్యకు కారణాలు..

సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. ఇలాంటి సమయంలో పులుపు పదార్థాలు ఎక్కువ తింటే సమస్య తీవ్రత పెరుగుతుంది. ఆమ్లాలు పుట్టి అది క్రమంగా త్రేన్పులు, ఛాతీలో మంటకు దారితీస్తుంది.

అద్బుతమైన పరిష్కారం..

* మన ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండే వాము(Ajwain) గ్యాస్ సమస్యలకు మంచి పరిష్కారం. అరటీస్పూన్ వాము, కొద్దిగా పింక్ సాల్ట్(Pink salt or Himalayan salt), పావు స్పూన్ ఇంగువ(Asafoetida) తీసుకోవాలి. ఈ మూడింటిని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని ప్రతి రోజూ భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.ఇలా 15రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణసంబంధ సమస్యలు, పేగులకు సంబంధించిన జబ్బులు, కడుపులో గ్యాస్ ఉత్పత్తి కావడం వంటివి తగ్గిపోతాయి.

వీటిలో ఏముంటుందంటే..

వాము వేడెక్కించే గుణం కలిగి ఉంటుంది. దీనికి తగ్గట్టు ఇది తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. శరీరంలో ఎక్కువైన వాతాన్ని, కఫాన్ని తిరిగి సాధారణ స్థాయికి తీసుకొస్తుంది.

ఇంగువలో కూడా వాములో ఉండే గుణాలే ఉంటాయి. ఇది వాతాన్ని సాధారణ స్థాయికి తీసుకురావడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్దకం, కడుపులో పురుగులు వంటి సమస్యలు తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

పింక్ సాల్ట్ చలువ చేస్తుంది. ఇది శరరంలో వాత, పిత్త, కఫ గుణాలను సాధారణ స్థాయిలో ఉంచేందుకు సహకరిస్తుంది. ఛాతీ బిగుసుకుపోయినట్టు ఉండటం, మంటగా అనిపించడం వంటి సమస్యలు తగ్గిస్తుంది.

Read also: Fast Weight Loss Diet: బరువు తగ్గేందుకు ఏదేదో చేస్తుంటారు కానీ.. అత్యంత సులభమైన మార్గమేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!


Updated Date - 2023-03-17T13:48:38+05:30 IST