Girlfriend: ప్రియుడితో ఏకాంతం కోసం ఎంత పని చేసిందంటే.. నెట్టింట వైరల్‌గా మారిన యువతి వ్యవహారం..!
ABN , First Publish Date - 2023-07-19T11:54:30+05:30 IST
బిహార్ (Bihar) లోని బేతియా జిల్లా (Bettiah Dist) నౌతన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ (Bihar) లోని బేతియా జిల్లా (Bettiah Dist) నౌతన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆ గ్రామంలో ప్రతిరోజూ రాత్రిపూట ఒకే టైంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. ఇలా గత కొంతకాలంగా ఆ గ్రామం మొత్తం అంధకారంలో గడుపుతోంది. కానీ, ఎవరికీ అసలు ఎందుకు ఒకే సమయంలో కరెంట్ కట్ అవుతుందనేది అర్థం కాలేదు. ఎలక్ట్రిసిటీ అధికారుల వద్ద ఈ విషయమై ఫిర్యాదు చేశారు గ్రామస్థులు. దాంతో అధికారులు వచ్చి చెక్ చేశారు. అంతా బాగానే ఉందని చెప్పి వెళ్లిపోయారు. రోజూ పవర్ కట్ మాత్రం ఆగడం లేదు. ఇక ఆ సమయంలో ఊరంతా అంధకారంగా మారడంతో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. దాంతో రెండు ద్విచక్రవాహనాలు, కరెంట్ మోటార్లు, మేకలు దొంగలించారు.
ఇలా అయితే కాదు అని, గ్రామస్థులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. వారంతా కలిసి ఒకరోజు రాత్రి మాటు వేశారు. దాంతో అసలు దొంగలు పట్టుబడ్డారు. గ్రామంలోని ఓ యువతి, మరో యువకుడు ఏకాంతంగా ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారితో మాట్లాడగా.. ఇలా రోజూ ఒకే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంది ఆ యువతేనని తెలిసింది. ఆమె రోజూ తన లవర్‌ను కలుసుకునేందుకు రాత్రిపూట ట్రాన్స్‌పార్మరు వద్దకు వెళ్లి కరెంట్ సరఫరాను (Power Supply) నిలిపివేస్తుందట. ఇక కొందరు ఆ యువకుడికి దేహశుద్ధి కూడా చేశారు. తన ప్రియుడిని కొడుతుంటే ఆ యువతి అడ్డుకోవడం కొసమెరుపు. ఈ వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసుల జోక్యంతో ఈ ప్రేమ జంట వివాహానికి వారి పెద్దలు కూడా అంగీకరించారు. దాంతో వారి ప్రేమ కథ సుఖాంతం కావడం, అలాగే గ్రామంలో కరెంట్ కోత ఆగిపోయింది.