Train Video: రైల్లో తెగ కష్టపడి ఈ అమ్మాయిలు డాన్స్ వేస్తోంటే.. వెనుక కూర్చున్న ఇద్దరు మగాళ్ల రియాక్షన్ చూస్తే..!

ABN , First Publish Date - 2023-07-12T16:02:34+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది ఊవిళ్లూరుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి షార్ట్ వీడియో ఫార్మాట్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఓ కొత్త ట్రెండ్ ఉద్భవించింది.

Train Video: రైల్లో తెగ కష్టపడి ఈ అమ్మాయిలు డాన్స్ వేస్తోంటే.. వెనుక కూర్చున్న ఇద్దరు మగాళ్ల రియాక్షన్ చూస్తే..!

ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) యుగం నడుస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది ఊవిళ్లూరుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram reels) వంటి షార్ట్ వీడియో ఫార్మాట్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఓ కొత్త ట్రెండ్ ఉద్భవించింది. బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు, బస్సులు, మెట్రోల్లో డ్యాన్స్ చేస్తూ వీడియో (Dance Videos) తీసుకోవడం, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైంది. ఎన్ని విమర్శలు వస్తున్నా యువత మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రైలు (Train) లోపల ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియో (Girls dance Videos) వైరల్ అవుతోంది. @debangisenapati అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. నేహ కక్కర్ ఫేమస్ సాంగ్‌ ``బలెన్సియాగా`` (Balenciaga song)కు వారిద్దరూ చక్కగా డ్యాన్స్ చేశారు. అయితే ఆ సమయంలో వారి వెనకాల కూర్చున్న ఇద్దరు వ్యక్తులు మాత్రం వారిని అసలు పట్టించుకోలేదు. ఆ అమ్మాయిలు తమ ముందు డ్యాన్స్ చేస్తున్నా వారిద్దరూ మాత్రం తమ మొబైల్స్‌ను చూస్తూ కనీసం తలలు కూడా ఎత్తలేదు.

Viral Video: ఏడుస్తూ కూర్చున్న రైతు.. దగ్గరకు వెళ్లి ఓదార్చినా పట్టించుకోవడం లేదని ఈ కుక్కలు ఏం చేశాయో చూస్తే..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయింది. ఇప్పటివరకు 1.3 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 25 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``మొదట మెట్రో, ఇప్పుడు రైలు. సోషల్ మీడియా యూజర్లకు బాగా ఉపయోగపడుతున్నాయి``, ``చాలా చక్కగా డ్యాన్స్ చేశారు`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-12T16:02:34+05:30 IST