Govt Teacher: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్.. స్కూల్‌లో 'సోయిలేని' పనులు.. ప్యాంట్ జిప్ విప్పేసి మరీ..
ABN , First Publish Date - 2023-10-21T12:51:41+05:30 IST
విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ (Teacher).. స్కూల్‌కి పూటుగా తాగొచ్చి 'సోయిలేని' పనులు చేస్తుంటే.. అందులో చదివే విద్యార్థుల పరిస్థితి ఏంటి? తాగిన మైకంలో పాఠశాలకు వచ్చిన ఆ మాస్టారు కనీసం తన ప్యాంట్ జిప్, బటన్స్ కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ (Teacher).. స్కూల్‌కి పూటుగా తాగొచ్చి 'సోయిలేని' పనులు చేస్తుంటే.. అందులో చదివే విద్యార్థుల పరిస్థితి ఏంటి? తాగిన మైకంలో పాఠశాలకు వచ్చిన ఆ మాస్టారు కనీసం తన ప్యాంట్ జిప్, బటన్స్ కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. పాఠశాల ఆవరణలో పడుకుని తనకు ట్రాన్స్‌ఫర్ (Transfer) కావాలంటూ నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. ఆ గవర్నమెంట్ టీచర్ (Govt Teacher) నిర్వాహకాన్నంతటినీ ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. దాంతో నెటిజన్లు సదరు మాస్టారుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం చంబా జిల్లాలో చోటు చేసుకుంది. బార్‌మౌర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తి ప్రతిరోజు ఇలాగే పూటుగా మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు అక్కడివారు చెప్పారు.
Namma Yatri App: బెంగళూరు ఆటో డ్రైవర్లా మజాకా.. యాప్ ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.189 కోట్ల సంపాదన..!
ఇక తాజా ఘటన ఆ టీచర్ పీకలదాక తాగొచ్చి నడిరోడ్డుపై పడుకున్నాడు. అక్కడి నుంచి వెళ్లేవారు గుర్తించి అతడ్ని పైకి లేపుదామని ప్రయత్నించారు. కానీ, మాస్టారు మద్యం మత్తులో తనకు ట్రాన్స్‌ఫర్ కావాలని, అందుకే తాను ఇలా నిరసన తెలుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అతని ప్యాంట్ జిప్ (Pant zip), బటన్స్ ఉడిపోయి సోయిలేకుండా ఉండడం వీడియోలో ఉంది. ఇలా పూటుగా తాగి పాఠశాలకు రావడం ఏంటని? అడిగితే.. తాను సెలవుల్లో ఉన్నట్లు చెప్పాడు. తనకు ఇక్కడ పనిచేయడం ఇష్టంలేదని వెంటనే ట్రాన్స్‌ఫర్ కావాలని కొద్దిసేపు రచ్చ చేశాడు. దాంతో స్థానికులు అతనితో ఇది సరియైన పద్దతి కాదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. వారి మాట వినలేదు. ఇక ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ టీచర్ లీవులో ఉన్నాడని, ఈ ఘటనపై తమకు ఎవరూ రాతపూర్వక కంప్లయింట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. మాస్టారు తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అతడు 'టీచర్ కాదు.. పోకిరి'అని మండిపడుతున్నారు.