Viral Video: ఏంటి బాసూ.. పెళ్లి వేదిక మీదే ఇలా చేస్తే ఎలా.. పాపం ఆ వధువు పరిస్థితి ఏమైందో చూడండి..

ABN , First Publish Date - 2023-08-05T12:41:18+05:30 IST

ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన రోజు. ఎంతో సందడిగా, సంతోషంగా సాగే పెళ్లి వేడుకలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ వధూవరులే. పెళ్లిక హాజరయ్యే అందరి దృష్టీ వధూవరుల మీదే ఉంటుంది. దీంతో వధూవరులు చాలా హుందాగా, పద్ధతిగా పెళ్లి వేడుకలో పాల్గొంటారు.

Viral Video: ఏంటి బాసూ.. పెళ్లి వేదిక మీదే ఇలా చేస్తే ఎలా.. పాపం ఆ వధువు పరిస్థితి ఏమైందో చూడండి..

ఎవరి జీవితంలో అయినా పెళ్లి (Marriage) అనేది చాలా ముఖ్యమైన రోజు. ఎంతో సందడిగా, సంతోషంగా సాగే పెళ్లి వేడుకలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ వధూవరులే. పెళ్లికి హాజరయ్యే అందరి దృష్టీ వధూవరుల మీదే ఉంటుంది. దీంతో వధూవరులు చాలా హుందాగా, పద్ధతిగా పెళ్లి వేడుకలో పాల్గొంటారు. అయితే అప్పుడప్పుడు జరిగే కొన్ని అవాంఛనీయ ఘటనలు వధూవరులకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

@manojpehul అనే ట్విటర్ యూజర్ ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వధూవరులు పెళ్లి వేదిక మీద ఉన్నారు. బ్యాగ్రౌండ్‌లో షాహిద్ కపూర్ చిత్రం ``వివాహ్‌``లో పాట ప్లే అవుతోంది. దాంతో వధువు (Bride)ను ఎత్తుకుని ఫొటోలకు ఫోజులివ్వాలని వరుడి (Groom)ని అతడి స్నేహితులు కోరారు. స్నేహితుల కోరిక ప్రకారం వధువును ఎత్తేందుకు వరుడు ప్రయత్నించాడు. ఆమెను చేతులతో పట్టుకుని పైకి లేపాడు. అయితే బ్యాలెన్స్ సరిగ్గా కుదరకపోవడంతో పెళ్లి వేదిక పైనే ఇద్దరూ కింద పడిపోయారు (Groom falls with bride).

Tomato Price Effect: టమాటా ధరలు పెరగడంతో కొత్త రూటు.. వాటికి బదులుగా ఇప్పుడు వేటిని వాడుతున్నారో తెలిస్తే..!

వధువును వరుడు ఎత్తేయడంతో అందరూ షాకయ్యారు. ``అరే పరువు మొత్తం తీసేశాడురా`` అని స్నేహితులు అరవడం ఆ వీడియోలో వినిపించింది. ఆ వీడియో (Funny Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఆ వీడియోను 2 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ ఫన్నీ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``పాపం.. ఆ వధువు పరిస్థితి ఊహించలేకపోతున్నా``, ``పెళ్లి తర్వాత వరుడికి అసలైన శాస్తి జరుగుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-05T12:41:18+05:30 IST