అతిథుల సమక్షంలో అర్ధరాత్రి ఘనంగా జరిగిన వివాహం.. మరుసటి రోజు ఉదయం వధువును చూసి ఖంగుతిన్న వరుడు.. చివరకు..
ABN , First Publish Date - 2023-02-05T19:47:44+05:30 IST
పెళ్లి చూపుల్లో యువతి నచ్చడంతో వెంటనే వివాహం చేసుకునేందుకు అంగీకరించాడో యువకుడు. అర్ధరాత్రి వేళ బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. అనంతరం నవ వధువు అత్తారింట్లోకి అడుగుపెట్టింది. అయితే ..
పెళ్లి చూపుల్లో యువతి నచ్చడంతో వెంటనే వివాహం చేసుకునేందుకు అంగీకరించాడో యువకుడు. అర్ధరాత్రి వేళ బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. అనంతరం నవ వధువు అత్తారింట్లోకి అడుగుపెట్టింది. అయితే ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. భార్యను చూసిన వెంటనే ఖంగుతిన్న భర్త.. నాకు వద్దంటూ పుట్టింటికి పంపించేశాడు. తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సంభాల్ జిల్లా హజ్రత్ నగర్ పరిధి కటౌలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దాల్‌చంద్ ఇటీవల పెళ్లి ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో పెళ్లి చూపుల్లో భాగంగా కైలాదేవి ప్రాంతానికి చెందిన యువతి (young woman) చూశాడు. అమ్మాయి నచ్చడంతో వెంటనే పెళ్లికి ఓకే చెప్పేశాడు. జనవరి 26న అర్ధరాత్రి బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం (marriage) జరిగింది. అయితే వీరి ఆచారం ప్రకారం పెళ్లి మంటపంపై వధువు ముసుగు ధరించి ఉంటుంది. దీంతో మంటపంపై ఉన్న వధువును వరుడితో పాటూ బంధువులు కూడా చూసే అవకాశం లేకుండా పోయింది.
మరుసటి రోజు ఉదయం అత్తారింటికి వెళ్లిన వధువుకు ముసుగు తొలగించారు. అయితే ఆమెను చూడగానే వరుడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. పెళ్లి చూపుల్లో చిన్న కుమార్తెను చూపించిన అత్తమామలు, చివరకు మానసిక పరిస్థితి (mental problem) సరిగా లేని పెద్ద కుమార్తెను ఇచ్చి వివాహం చేశారని తెలుసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. నాకీ భార్య వద్దంటూ పుట్టింటికి పంపించాడు. చివరకు రెండు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.