Health Facts: 25 ఏళ్ల కుర్రాడికి సీటీ స్కాన్ చేసి చూస్తే షాకింగ్ రిజల్ట్.. కంప్యూటర్ ఎర్రర్ ఏమోనని డాక్టర్‌కు డౌట్.. చివరకు..!

ABN , First Publish Date - 2023-10-03T13:46:43+05:30 IST

25ఏళ్ళ కుర్రాడు హాస్పిటల్ కు వెళితే శస్త్రచికిత్స చేశారు. కానీ ఇంటికెళ్లిన కొంతసేపటికే ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఆ కుర్రాడికి మళ్లీ స్కాన్ చేస్తే కనిపించింది చూసి అందరూ షాకయ్యారు..

Health Facts: 25 ఏళ్ల కుర్రాడికి సీటీ స్కాన్ చేసి చూస్తే షాకింగ్ రిజల్ట్.. కంప్యూటర్ ఎర్రర్ ఏమోనని డాక్టర్‌కు డౌట్.. చివరకు..!

ఏదైనా అనారోగ్యం రాగానే వెంటనే వైద్యులను కలవడం అందరూ చేసేపని. ఓ పాతికేళ్ళ కుర్రాడికి తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు విపరీతంగా ఉండటంతో హాస్పిటల్ కు వెళ్లాడు. అక్కడ వైద్యులు ఆ కుర్రాడిని పరీక్షించి సీటీ స్కాన్ తీశారు. ఆ స్కాన్ అనంతరం అతడికి శస్త్రచికిత్స కూడా చేశారు. సమస్య పరిష్కారమైందనుకుని హాయిగా ఇంటికి వెళ్లిన వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. డాక్టర్లు చేసిన మిస్టేక్ పెద్ద దారుణానికి దారితీసింది. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు విస్తుపోతున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఇంగ్లాడ్(England) దేశ రాజధాని లండన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లండన్ లో జోష్ వార్నర్ అనే పాతికేళ్ల కుర్రాడు(25years young man) తన కుటుంబ సభ్యులతో కలసి నివసిస్తున్నాడు. అతను కార్పెంటర్ పని చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జోష్ వార్నర్ కు తరచుగా తలనొప్పి, కళ్లు తిరగడం జరిగేది. మొదట్లో అతను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత తలనొప్పి, కళ్లు తిరగడం ఎక్కువ కావడంతో భరించలేక కుటుంబ సభ్యుల సహాయంతో డరెంట్ వ్యాలి హాస్పిటల్ కు వెళ్లాడు. హాస్పిటల్ లో వైద్యులు జోష్ వార్నర్ కు సీటీ స్కాన్(CT scan) తీశారు. అతనికి అపెండిసైటిస్(appendicitis) సమస్య ఉన్నట్టు నిర్ధారించారు. అపెండిసైటిస్ సమస్యకు ఉండాల్సిన కడుపునొప్పి, ఇతర లక్షణాలు ఏమీ లేకపోయినా శస్త్రచికిత్స చేసి అపెండిక్స్ ను తొలగించారు. శస్త్రచికిత్స తరువాత జోష్ వార్నర్ ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మళ్లీ తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలతో జోష్ వార్నర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దీంతో డిశ్చార్జ్ జరిగిన కొన్ని గంటలకే మళ్లీ అదే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. జోష్ వార్నర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మళ్లీ సీటీ స్కాన్ తీశారు. అందులో మెదడుకు సంబంధించి సమస్య(brain problem) ఉన్నట్టు కనిపించింది. కానీ కంప్యూటర్ లో ఏదో లోపం ఉందని, తాము చేసిన చికిత్స సరైనదేనని చెప్పి వైద్యులు వారిని అక్కడి నుండి పంపేశారు. ఆ తరువాత చాలాసార్లు జోష్ వార్నర్ డాక్టర్లను సంప్రదించినా వారు అతన్ని వెనక్కు పంపేశారు.

Health Facts: జిమ్‌కు వెళ్లకుండానే కండలు పెంచొచ్చని తెలుసా..? బరువు తగ్గేందుకు ఈ 5 ట్రిక్స్‌ను పాటిస్తే..!



కొన్నిరోజులు గడిచిన తరువాత జోష్ వార్నర్ ఒకరోజు బాత్రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయాడు. అతన్ని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్ లో చేర్చి మళ్లీ స్కానింగ్ తీశారు. స్మాన్ లో మెదడులో పెద్ద కణితి(tumor in brain) కనబడింది. అది మెదడు వెనుక కుడివైపు నుండి మధ్య భాగం వరకు విస్తరించి ఉంది. అది మిడ్ లైన్ గ్లియోమా అనే ప్రాణాంతక క్యాన్సర్(midline glioma) అని, అది చాలా వేగంగా పెద్దది అవుతుందని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ సంఘటన బయటపడిన 12రోజులకే జోష్ వార్నర్ మరణించాడు. తప్పుడు చికిత్స అందించి సమస్య విషమించడానికి కారణమైన మునుపటి హాస్పిటల్ మీద జోష్ వార్నర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నారు. పోలీసులు ప్రస్తుతం దీని గురించి విచారణ చేస్తున్నారు.

Health Facts: మగాళ్లలోనే ఎక్కువగా కనిపించే ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసా..? పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తోందంటే..!


Updated Date - 2023-10-03T13:46:43+05:30 IST