Health Secret: 100 ఏళ్ల పాటు హ్యాపీగా బతకాలనుందా..? అయితే ఈ 3 అలవాట్లను వెంటనే మానేయండి..!
ABN , First Publish Date - 2023-11-04T08:59:33+05:30 IST
ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే మూడే మూడు పదార్థాలను వదిలిపెడితే చాలు వందేళ్ళ ఆరోగ్యకరమైన జీవితం గ్యారెంటీ..
ఎవరైనా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారంటే వారి ఆరోగ్యం బాగున్నట్టే లెక్క. 70, 80ఏళ్ల వయసు దాటినా నిక్షేపంగా ఎవరి పనులు వారు చేసుకుంటున్న బామ్మలను, తాతయ్యలను చూసినప్పుడు వారి లైప్ స్టైల్, వారి ఆహారం చాలా శక్తివంతమైనది అని అంటూ ఉంటారు. ప్రస్తుతకాలంలో మాత్రం 50ఏళ్లు వచ్చేసరికి శరీరంలో బోలెడు రోగాలు వచ్చేస్తున్నాయి. వాటితో సతమతమవుతూ బ్రతకడం నిజంగా నకరప్రాయంగానే ఉంటుంది. కానీ ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే మూడే మూడు పదార్థాలను వదిలిపెడితే చాలు వందేళ్ళ ఆరోగ్యం గ్యారెంటీ అంటున్నారు(Avoid 3 foods for long life). మూడు ఆహారాలు మానేస్తే శరీరంలో ఎందుకంత మార్పు? ఇంతకూ మానేయాల్సిన ఆహారాలేంటి? తెలుసుకుంటే..
బ్రెడ్, బంగాళాదుంపలు..(bread, potato)
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బ్రెడ్, బంగాళాదుంపలు వదిలేయాలని 100ఏళ్లు నిండినా ఇంకా ఆరోగ్యంగా ఉన్న మార్తా అనే మహిళ చెప్పుకొచ్చింది. వీటి ద్వారా ఆహారంలో చాలా కేలరీలు తగ్గుతాయి. 100ఏళ్ల వయసులోనూ ఆమె ప్రతిరోజూ సులువుగా 1500అడుగులు నడవడం, సైక్లింగ్ కూడా చేస్తోంది. దీన్ని బట్టి ప్రతిరోజూ నడక, సైక్లింగ్, ఈత, ఏరోబిక్ వ్యాయామాలు, కేలరీలు తక్కువగా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఇట్టే అర్థం అవుతోంది.
Read Also: Water Drinking Rules: నిలబడి మంచినీళ్లను తాగకూడదా..? అసలు మంచినీళ్లను ఎలా తాగాలని ఆయుర్వేదంలో రాసి ఉందంటే..!
మాంసాహారం, ఎర్రమాంసం..(meat, red meat)
మాంసాహారం శరీరాన్ని తొందరగా వృద్దాప్యానికి, జబ్బులకు దగ్గర చేస్తుంది. మాంసాహారం అంత బలాన్ని ఇచ్చే శాఖాహార ఆహారాలు తీసుకోవడం ,తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రం శాఖాహారమే బెస్ట్ ఆప్షన్.
ఉప్పు .. (salt)
ఉప్పు శరీరానికి అవసరమే కానీ మితిమీరి తింటే మాత్రం ఆరోగ్యానికి ముప్పే. ఉప్పును నియంత్రించేవారు చాలావరకు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఉప్పు తినడం తగ్గిస్తూ రావాలి.
పై మూడింటిని ఆహారం నుండి తొలగించుకోవడంతో పాటు ఎక్కడికైనా వెళ్లడమనే అలవాటును పాటించాలి. ప్రయాణాలు అంటే చాలామంది విసిగించుకుంటారు. కానీ ప్రయాణాలు మనిషి శరీరానికి చాలా గొప్ప ఊరడింపును ఇస్తాయి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఎక్కడో ఒకచోటికి వెళుతూ ఉన్నా, ప్రకృతికి దగ్గరగా చెట్లు, చేమలు, జలపాతాలు ఉన్న ప్రాంతంలో కొద్దిసేపైనా గడపడం చెప్పలేనంత ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. శరీరంలో ప్రాణ శక్తిని అధికం చేస్తుంది.