Health Tips: ఈ 4 రకాల ఆకుకూరలు, కూరగాయలను పొరపాటున కూడా పచ్చివి తినకండి.. తింటే ఏమవుతుందంటే..!

ABN , First Publish Date - 2023-08-17T17:20:12+05:30 IST

ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద స్పృహ పెరిగినప్పటి నుండి చాలామంది కొత్త అలవాట్లు ఫాలో అవుతున్నారు. వీటిలో పచ్చిగా ఉన్న ఆహారం తీసుకోవడం ఒకటి.

Health Tips: ఈ 4 రకాల ఆకుకూరలు,  కూరగాయలను పొరపాటున కూడా పచ్చివి తినకండి.. తింటే ఏమవుతుందంటే..!

'అతి సర్వత్రా వర్జయేత్' అని పెద్దలన్నారు. అతిగా చేస్తే మంచి కూడా చెడుగా మారే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద స్పృహ పెరిగినప్పటి నుండి చాలామంది కొత్త అలవాట్లు ఫాలో అవుతున్నారు. వీటిలో పచ్చిగా ఉన్న ఆహారం తీసుకోవడం ఒకటి. సాధారణంగా క్యారెట్, కీరదోసకాయ వంటివి పచ్చిగా తినేవారు. కానీ ఈ లిస్ట్ ఇప్పుడు పెద్దదైంది. కొందరు సరైన అవహాన లేక ఆరోగ్యానికి మంచిదనే అపోహాలో కొన్ని రకాల కూరగాయలు పచ్చిగా తింటున్నారు. విదేశీయుల తరహాలో సలాడ్ లు తింటున్నారు. వీటిలో కొన్ని మంచి చేయకపోగా చెడు చేసే అవకాశాలు ఎక్కువ. వీటిలో ఇ-కోలి, టేప్ వార్మ్, టేప్ వార్మ్ గుడ్లు, పరాన్నజీవులు మొదలైనవి సూక్ష్మాతిసూక్ష్మంగా ఉంటాయి. ఇవి పేగులలోకి చేరి ఆ తరువాత రక్తప్రవాహం ద్వారా శరీరమంతా వ్యాపించి కండరాలకు నష్టం కలిగిస్తాయి. ఇవి మెదడుకు చేరితేతే సిస్టిసెర్కోసిస్, మూర్చలు, తలనొప్పి వంటి సమస్యలు, కాలేయం, కండరాలలో తిత్తులు ఏర్పడటం వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి. ఇన్ని సమస్యలు కలిగించే నాలుగు రకాల కూరగాయలు ఏమిటో తెలుసుకంటే..

చామకూర(Taro leaves) గురించి అందరికీ తెలిసిందే ఇది ఆరోగ్యానికి చాలామంచిది. ఈ చామ ఆకులు పచ్చిగా ఎప్పుడూ తీసుకోకూడదు. ఇవి పచ్చిగా తీసుకుంటే అధిక ఆక్సలేట్ స్థాయిలకు కారణం అవుతాయి. అందుకే వీటిని ఉపయోగించే ముందు వేడినీటిలో కొద్దిసేపు ఉంచాలి. ఇదే నియమం పాలకూరకు కూడా వర్తిస్తుంది.

Sleeping: రాత్రిళ్లు సరిగా నిద్రపోవడం లేదా..? రోజుకు 5 గంటల కంటే తక్కువసేపు పడుకుంటే జరిగేది ఇదే..!



సలాడ్ లు, శాండ్విచ్ లలో క్యాబేజీని(Cabbage) పచ్చిగానే ఉపయోగిస్తుంటారు. చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడతారు కూడా. కానీ కంటికి కనిపించని టేప్ వార్మ్ లు, వాటి గుడ్లు క్యాబేజీ ఆకుల మీద, వాటి మధ్యలో ఉంటాయి. పైగా క్యాబేజీ పంటకు వినియోగించే రసాయనాల కారణంగా కూడా ఇవి పచ్చిగా తినడం ప్రమాదం. వీటిని ఉడికించకపోయినా వేడినీటిలో కాసేపు ఉంచి ఆ తరువాత వాడుకోవాలి.

క్యాబేజీ లాగే క్యాప్సికం(capsicum) కూడా పచ్చిగా తినడానికి ఉపయోగిస్తారు. వెజిటేబుల్ సలాడ్ లో క్యాప్సికం తప్పకుండా స్థానం కలిగి ఉంటుంది. కానీ క్యాప్సికం లోపల ఉండే విత్తనాల మధ్య టేప్ వార్మ్ లు ఉండే అవకాశం ఎక్కువ. క్యాప్సికం పై భాగం కట్ చేసి, విత్తనాలు తొలగించి ముక్కలు చేసి వేడినీళ్లలో కొద్దిసేపు ఉంచిన తరువాతే వాడుకోవాలి.

బెండకాయలు(ladyfinger) తింటే లెక్కలు బాగా వస్తాయన్నది చాలామంది నమ్మకం. దీన్ని అటుంచితే పచ్చిగా ఉన్నట్టే లేత బెండకాయలు తినడానికి భలే ఉంటాయి. కానీ వీటి లోపలి విత్తనాల్లో కూడా టేప్ వార్మ్ లు ఉండే అవకాశం ఎక్కువ. వీటిని తినేముందు తేలికగా అయినా ఉడికించడం చాలా ముఖ్యం.

Dental Care Tips: ఈ 5 టిప్స్‌లో ఏ ఒక్కదాన్ని పాటించినా.. పళ్లు తెల్లగా మారిపోవడం ఖాయం..!


Updated Date - 2023-08-17T17:20:12+05:30 IST