Health Tips: రోజుకొక యాపిల్ కాదు.. రోజుకొక జామపండు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. ముఖ్యంగా ఆ సమస్య ఉన్నవాళ్లకు..
ABN , First Publish Date - 2023-08-15T17:48:18+05:30 IST
పేదవాడి యాపిల్ గా జామపండును పిలుస్తారు. యాపిల్ పండులో ఉండే పోషకాలలో చాలావరకు జామపండులో కూడా ఉంటాయి. ధర కూడా యాపిల్ పండ్ల కంటే తక్కువే. ఈ జామపండు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ తో పనిలేదని అందరూ అంటారు. కానీ రోజుకొక జామపండు తింటే మాత్రం..
పేదవాడి యాపిల్ గా జామపండును పిలుస్తారు. యాపిల్ పండులో ఉండే పోషకాలలో చాలావరకు జామపండులో కూడా ఉంటాయి. ధర కూడా యాపిల్ పండ్ల కంటే తక్కువే. ఈ జామపండు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ తో పనిలేదని అందరూ అంటారు. కానీ రోజుకొక జామపండు తింటే అధ్బుతం జరుగుతుంది. జామపండులో విటమిన్-సి, పొటాషియం, సోడియం, విటమిన్-బి6, ఐరన్, మెగ్నీషియం, ఇలా బోలెడు విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఇన్నవారికి ఇది గొప్ప ఔషదమే అని చెప్పవచ్చు. మధుమేహం ఉన్నా, మధుమేహం లేకపోయినా రోజుకొక జామపండును అల్పాహారం లేదా స్నాక్స్ టైమ్, సలాడ్లు, స్మూతీలుగా తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసుకుంటే..
జామపండు(Guava)లో పైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తింటే చాలాసేపటి వరకు ఆకలి సమస్య దరిచేరదు. బరువు పెరుగుతామేమో అనే భయం ఉన్నవారు. ఎక్కవగా కూర్చుని పనిచేసేవారు, ఇప్పటికే అధిక బరువుతో(over weight) ఇబ్బంది పడుతున్నవారు జామపండు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజుకొక జామపండు తింటే అధికబరువు కారణంగా వచ్చే మధుమేహం(diabetes) సమస్యకు చెక్ పెడుతుంది. మధుమేహం ఉన్నవారిలో కూడా అధిక బరువు నియంత్రించడానికి జామపండ్లు దోహదం చేస్తాయి. రోజుకొక జామపండు తినే వారిని చక్కెర వ్యాధి టచ్ చేయదు.
Viral Video: నిజమైన దేశభక్తి అంటే ఇది భయ్యా.. ఫారిన్ యూనివర్సిటిలో ఇండియా కుర్రాడు చేసిన పని చూస్తే..
ఇప్పటికాలంలో చిన్నవయసులోనే రక్తపోటు(blood pressure) సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు చాలామంది ఉన్నారు. జామపండ్లలో అధికమొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. బిపి ఎక్కువగా ఉన్నప్పుడు అది మధుమేహానికి సంబంధించి ఎన్నో సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. రోజుకొక జామపండు తింటే అధిక రక్తపోటు మంత్రమేసినట్టు కంట్రోల్ లోకి వస్తుంది.
పైబర్(fiber) ఉన్న ఆహారాలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. జామపండులో పైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. సరైన జీర్ణక్రియ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు జామపండు తింటే మంచి జీర్ణక్రియతో పాటు అధికంగా ఉన్న చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి.
జామపండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్-సి(vitamin-c) రోగనిరోధక శక్తిని బలంగా మారుస్తుంది. జబ్బులను నయం చేస్తుంది. మధుమేహం ఉన్నవారిలో ఎదురయ్యే నరాల సంబంధ సమస్యలను నివారిస్తుంది. జామపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇది రక్తంలో మధుమేహం ఉన్నవారికి మంచిది.