Health Tips: అమ్మ బాబోయ్.. ఒకే ఒక్క లవంగం వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతాయా..? రోజూ పరగడుపున ఓ లవంగాన్ని తింటూ ఉంటే..

ABN , First Publish Date - 2023-08-09T16:16:46+05:30 IST

ప్రతి రోజూ ఉదయాన్నే ఒక లవంగం తినడం వల్ల కలిగే ఫలితాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Health Tips: అమ్మ బాబోయ్.. ఒకే ఒక్క లవంగం వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతాయా..? రోజూ పరగడుపున ఓ లవంగాన్ని తింటూ ఉంటే..

లవంగాలు వంటింటి మసాలా దినుసుగా అందరికీ సుపరిచితమే.. వేల సంవత్సరాల క్రితం నుండే లవంగాలు వివిధ దేశాల్లో వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నోరకాల మసాలా ఆహార పదార్థాల తయారీలో లవంగం తప్పకుండా వినియోగిస్తుంటారు. లవంగాలు ఆహారానికి రుచి, వాసన ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజూ ఉదయాన్నే ఒక లవంగం తినడం వల్ల కలిగే ఫలితాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు లవంగాలలో ఉండే పోషకాలు ఏంటి? ప్రతి రోజూ పరగడుపున ఒక లవంగం(Clove) తింటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

లవంగాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోపారియం, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, విటమిన్-సి, రిబోప్లావిన్, థయామిన్, విటమిన్-బి కాంప్లెక్స్ లు సహా బోలెడు పోషకాలు ఉన్నాయి.

ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక లవంగాన్ని తింటే(Eating clove with empty stomach in the morning) జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది. మౌత్ రిఫ్రెషనర్ గా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం లాంటి అంటువ్యాధులతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగాన్ని తింటూ ఉంటే సమస్యలను తగ్గించి శరీరంలో ఇమ్యూనిటీ పెంచుతుంది. అంతేకాదు పరగడుపున లవంగం తింటూ ఉంటే అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం, కడుపులో పుండ్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలలో విటమిన్-సి ఉంటుంది. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే.

Viral News: ఇంజనీరింగ్ చదివి ఇదేం పనని అడిగితే.. ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పింది విని నోరెళ్ల బెట్టిన మహిళ.. నిజమేనా అని ఆరా తీస్తే..!



లవంగాన్ని పరగడుపున తింటే ఎటువంటి పంటి సమస్యలు రావు. పళ్లు, చిగుళ్ళు దృఢంగా ఉంటాయి. లవంగాలలో యూజీనాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది సైనస్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఇలా లవంగం తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Viral Video: కూతుళ్లు ఉన్న తండ్రులకే.. ఈ వీడియోలోని మజా అర్థమవుతుంది.. ఈ చిన్నారి తండ్రి పక్కనే కూర్చుని మరీ..!


Updated Date - 2023-08-09T16:16:46+05:30 IST