Health Tips: 35 ఏళ్ల వయసు దగ్గరపడిందా..? ఎంత ప్రయత్నించినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదా..? అయితే..!
ABN , First Publish Date - 2023-09-19T13:42:43+05:30 IST
35ఏళ్ల తరువాత బరువుకు సంబంధించిన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా పొట్ట భాగం, తొడలు, తుంటి మీద కొవ్వు పేరుకుపోతుంటుంది. దీని కారణంగా శరీర సౌష్టవం చాలా పాడైపోతుంది. దీన్ని సరిచేసుకోవడానికి కేవలం ఈ 5పనులు చేస్తే చాలు..
బోలెడు రోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా అధికబరువు పిలవబడుతుంది. సాధారంగా మహిళలు 35ఏళ్ల తరువాత బరువుకు సంబంధించిన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా పొట్ట భాగం, తొడలు, తుంటి మీద కొవ్వు పేరుకుపోతుంటుంది. దీని కారణంగా శరీర సౌష్టవం చాలా పాడైపోతుంది. దీన్ని తగ్గించుకోవడానికి బయటి ఆహారాలకు దూరంగా ఉన్నా సరే అధిక బరువు అలాగే ఉంటుంది. కొందరు బరువు పెరగడానికి శరీరంలో నీరు చేరడం ప్రధానకారణం అంటుంటారు. కానీ అసలు సమస్య అది కాదని మహిళా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికబరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్(estrogen hormone) అధికంగా విడుదల కావడమే కారణం అని అంటున్నారు. దీన్ని కంట్రోల్ చేయడం ద్వారా బరువు కూడా క్రమంగా తగ్గవచ్చు. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడానికి శరీరాన్ని డిటాక్స్ చేసుకోవాలి. శరీరాన్ని డిటాక్స్ చేయడానికి 5 సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల 3నెలల్లోనే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఐదు సూక్ష్మపోషకాలు ఏంటో తెలుసుకుంటే..
రాగిపాత్ర నీరు..(copper vessel water)
ఉదయం నిద్రలేవగానే చాలా మంది సాధారణ నీరు, వేడినీరు, తేనె నిమ్మరసం ఇలా చాలా విధాలుగా తీసుకుంటూ ఉంటారు. కానీ రాత్రిపూట రాగిపాత్రలో నీరు పోసి, రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే కాలేయం ఆరోగ్యంగా మారుతుంది. శరీరంలోని అదనపు ఈస్ట్రోజెన్ ను తొలగించే సామర్థ్యం రాగిపాత్ర నీటి ద్వారా పెరుగుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
Viral: రూ.6 కోట్ల విలువైన ఈ ఇంటిని.. కేవలం రూ.100 కే అమ్మేస్తున్నారంటే నమ్మలేరు కదూ.. నిజమండీ బాబోయ్.. ఎక్కడంటే..!
అల్పాహారం..(breakfast)
రోజులో అల్పాహారం చాలా ముఖ్యమైన పాత్ర కలిగిఉంటుంది. అల్పాహారం అస్సలు స్కిప్ చేయకూడదని అంటారు. అయితే అల్పాహారంలో కూడా బాదం(almons), పొద్దుతిరుగుడు విత్తనాలు(sunflower seeds) తినడం చాలా మంచిది. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇది కాలేయం వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.
టమోటా సలాడ్..(tomato salad)
ప్రతి రోజు ఒక గిన్నె టమెటా సలాడ్ తినాలి. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎస్ట్రాడియోల్ చర్యను కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ క్రమంగా తగ్గుతుంది.
బ్రెజిల్ నట్స్..(Brazil nuts)
బ్రెజిల్ నట్స్ పెద్ద పరిమాణంలో పసనగింజలను పోలిన విత్తనాలు. వీటిలో ఉండే సెలీనియం డిటాక్సిఫైయింగ్ ఎంజైమ్ గా పరిగణించబడుతుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిని సమతుల్యం చేయడం ద్వారా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
శనగల సలాడ్..(chickpea salad)
మధ్యాహ్న భోజనంలో అన్నానికి బదులుగా శనగల సలాడ్ తింటూ ఉంటే సులువుగా బరువు తగ్గవచ్చు. ఇందులో విటమిన్-బి6 ఉంటుంది. ఇది కాలేయం ఎంజైమ్ లను గ్రహించడంలోనూ, ఈస్ట్రోజెన్ హార్మోన్ ను తగ్గించండంలోనూ సహాయపడుతుంది.