Share News

Health Tips: టమోటాలతో ఈజీగా బరువు తగ్గొచ్చా..ఈ 6 కారణాలు తెలిస్తే..

ABN , First Publish Date - 2023-11-26T16:18:52+05:30 IST

ఎప్పుడూ కూరల్లో వాడే టమోటాలను రోజూ తింటే జరిగేది ఇదే..

Health Tips: టమోటాలతో ఈజీగా  బరువు తగ్గొచ్చా..ఈ 6 కారణాలు తెలిస్తే..

టమోటాలు ప్రతి ఇంట్లో వంటల్లో అధికంగా ఉపయోగించే కూరగాయ. టమోటా లేకపోతే కూర రుచి అస్సలు బాగుండదు. వీటి ధర ఎక్కువగా ఉన్నప్పుడు తప్ప ప్రతినిత్యం వీటిని ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడూ కూరల్లో వాడే టమోటాలతో బరువు తగ్గచ్చట. ప్రతిరోజూ భోజనానికి అరగంట ముందు కొన్ని టమోటా ముక్కలు తింటే ఈజీగా బరువు తగ్గుతారని అంటున్నారు(weight loss for red tomato). అసలు టమోటాలతో బరువు తగ్గడం ఎలా సాధ్యం? ఈ 6 కారణాలు తెలుసుకుంటే..

టమోటాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువ. విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తాయి. అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. భోజనానికి అరగంట లేదా గంట ముందు కొన్ని టమోటా ముక్కలు తింటే బరువు తగ్గడంలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనడానికి 10 సంకేతాలు..


టమోటాలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ టమోటాలలో ఉంటాయి. కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. శరీరం కార్బోహైడ్రేట్లు, చక్కెరలు గ్రహించాన్ని నెమ్మది చేస్తుంది. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది. అతిగా తినాలనే కోరికను అదుపుచేస్తుంది. ఇక ఇందులోని కరగని ఫైబర్ మలబద్దకం సమస్యను పరిష్కరిస్తుంది. చక్కెర స్థాయిలు. జీర్ణవ్యవస్థ సజావుగా ఉంటే బరువు తగ్గడం సులువు.

టమోటాలలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. శరీరంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆకలి హార్మోన్ ను నియంత్రిస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. భోజనం ముందు కాసిన్ని టమోటా ముక్కలు తింటే చాలు చిరుతిండి తినాలనే కోరిక తగ్గిస్తుంది. తత్ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

జీవక్రియ పెంచడంలో కూడా టమోటా ది బెస్ట్. వీటిలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలోనూ, కొవ్వును బర్న్ చేయడంలోనూ సహాయపడుతుంది. క్యాప్సైసిన్ థర్మోజెనిస్ ను పెంచుతుంది. ఇది వేడిని ఉత్పత్తి చేసి కొవ్వు కరిగిస్తుంది.

టమోటాలలో లైకోపీన్ మెండుగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. శరీరంలో కొవ్వును కరిగించడం ద్వారా బరువు నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతంది.

టమోటాలలో దాదాపు 95శాతం నీరు ఉంటుంది. ఈ కారణంగా టమోటాలు తింటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులో ఉండే నీటి శాతం జీవక్రియ రేటు పెంచడానికి, ఆహారం కోరికలు తగ్గించడానికి, కడుపునిండిన భావన ఎక్కువసేపు ఇంచడానికి సహాయపడుతుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి.

(నోట్: ఇందులో అంశాలు పలు అధ్యయనాలు, నిపుణులు పేర్కొన్న సమాచారం ఆధారంగా పొందుపరచబడింది. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్యలున్నా వైద్యులను సంప్రదంచడం మంచిది.)

ఇది కూడా చదవండి: పచ్చి టమోటాలు తింటే ఎన్ని లాభాలో..

Updated Date - 2023-11-26T16:18:54+05:30 IST