Health Tips: బరువు తగ్గుతామనే భ్రమలో ఎన్ని పొరపాట్లు చేస్తున్నారో తెలుసా? ఉదయాన్నే అందరూ తాగే ఈ డ్రింక్స్ వల్లనే..

ABN , First Publish Date - 2023-07-16T13:30:39+05:30 IST

బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఉదయాన్నే వెయిట్ లాస్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ ఈ పొరపాట్ల వల్లే అవి ఎపెక్టీవ్ అయినా ఆశించిన ఫలితం ఉండటం లేదట..

Health Tips:  బరువు తగ్గుతామనే భ్రమలో ఎన్ని పొరపాట్లు చేస్తున్నారో తెలుసా? ఉదయాన్నే అందరూ తాగే ఈ డ్రింక్స్ వల్లనే..

మనం తినే ఆహారం సరిగా లేకపోతే అది శరీరం మీద దుష్ర్ఫభావాలు చూపిస్తుంది. బయటి ఆహారం, చక్కెరలు, నూనెలు, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తినడం వల్ల, హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్లా బరువు పెరుగుతారు. అయితే బరువు తగ్గించుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేసేవారు చాలామందే ఉంటారు. కొందరు వేడినీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగుతారు. మరికొందరు జీలకర్ర నీళ్లు తాగుతారు. ఇంకొందరు ఉసిరికాయ జ్యూస్, అలోవెరా జ్యూస్ వంటివి తాగుతారు. ఇలాంటివెన్నో రోజూ ఫాలో అయ్యే ఎందరో తమకు తెలియకుండానే చాలా పెద్ద పొరపాట్లు చేస్తున్నారు. ఈ కారణంగానే వీటిని ఫాలో అయినా బరువు తగ్గడం లేదని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. అసలు బరువు తగ్గడంకోసం తాగే డ్రింక్స్ విషయంలో చేస్తున్న పొరపాట్లేమిటి? ఏ డ్రింక్స్ తాగాలి? పూర్తీగా తెలుసుకుంటే..

జీలకర్ర నీరు(cumin seed water) బరువు తగ్గడానికి సహాయపడుతుందని అంటూ ఉంటారు. ఈ కారణంగా రాత్రి సమయంలో జీలకర్రను నీటిలో వేసి ఉదయాన్నే ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగుతుంటారు. ఈ నీరు తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలో టాక్సిన్ లు తొలగిపోతాయి. మరికొందరు బరువు తగ్గడానికి, హార్మోన్ సమస్యలు నియంత్రించడానికి మెంతి నీరు(fenugreek water) తాగుతుంటారు. రాత్రి సమయంలో నీటిలో మెంతులు నానేసి, ఉదయాన్నే ఆ నీటిని తాగుతుంటారు. శరీరంలో వేడి అధికంగా ఉన్నవారు వేడి తగ్గడానికి, అలాగే బరువు తగ్గడానికి కొత్తిమీర జ్యూస్(coriander juice) తాగుతూ ఉంటారు. అయితే ఈ మూడు డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివే, బరువు తగ్గడానికి సహకరిస్తాయి. అయినా కంటిన్యూగా 20రోజులకు మించి తాగకూడదు. ప్రతి జ్యూస్ తాగిన తరువాత కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. లేకపోతే లివర్ సమస్యలు వస్తాయట.

Viral Video: బాగా ఆకలిగా ఉన్న చిరుత వేట ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూస్తే గుండెలు అదురుతాయి..


చాలామంది బరువు తగ్గడానికి ఎక్కువగా ఫాలో అయ్యే చిట్కా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం(hot water with lemon juice) కలుపుకుని తాగడం. దీనిలాగే తేనె, నిమ్మరసం కూడా ఆరోగ్యమేనని రోజూ పరగడుపున వేడినీటిలో కలిపి తాగుతుంటారు. కానీ ఇది అసిడిటీకి(acidity) దారితీస్తుంది. శరీరంలో పిత్తాన్ని పెంచుతుంది. ఈ కారణంగా ప్రతి 40రోజుల తరువాత వేడినీళ్ళలో నిమ్మరసం కలిపి తాగే అలవాటుకు గ్యాప్ ఇవ్వాలి. ఆ తరువాత మళ్ళీ కొనసాగించవచ్చు. తేనెను వేడిగా ఉన్న దేంతోనూ తీసుకోకూడదు. పైపెచ్చు తేనె తీసుకుంటే బరువు తగ్గుతారని ఆయుర్వేదం అస్సలు చెప్పలేంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

ఉసిరికాయ(Gooseberry), సొరకాయ జ్యూస్(bottle gourd) తాగితే బరువు తగ్గుతారని అనుకుంటారు. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగుతుంటారు. అయితే ఈ జ్యూస్ వల్ల జీర్ణాశయం దెబ్బతింటుందట. కడుపు ఉబ్బరం ఏర్పడుతుందట. అందుకే వీటిని ఎక్కువ రోజులు తీసుకోకూడదు. ఉదయాన్నే వేడినీటిలో ఆవు నెయ్యి కొద్దిగా కలిపి తాగితే శరీరంలో వాతం, పిత్తం హరిస్తుందట. కానీ అజీర్ణం సమస్య ఉన్నవారు దీన్ని తాగకూడదు. అదేవిధంగా జీలకర్ర, కొత్తిమీర, సొంపు మూడింటితో టీ చేసుకుని తాగినా గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గి, బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. కానీ ఇది 40రోజులు మాత్రమే తాగాలి.

Marriage: మంచి వరుడిని చూసి పెట్టండి.. రూ.4 లక్షలు గిఫ్ట్‌గా ఇస్తానంటూ ఓ యువతి బంపరాఫర్..!


Updated Date - 2023-07-16T13:30:39+05:30 IST