Health Tips: అకారణంగా జబ్బులు రావడానికి అసలు కారణం ఇదే.. ఏ నెలలో ఏ ఆహారాలు తినకూడదు? ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2023-07-30T14:17:06+05:30 IST

ఇప్పట్లో సీజన్ తో సంబంధం లేకుండా ఎన్నోరకాల కూరగాయలు, పండ్లు లభిస్తున్నాయి. వీటిని తినడం ఎంతో గర్వంగా ఫీలవుతుంటారు. కానీ ఇలా చేస్తే..

Health Tips:  అకారణంగా జబ్బులు రావడానికి అసలు కారణం ఇదే.. ఏ నెలలో ఏ ఆహారాలు తినకూడదు? ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..

శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం అని అంటారు. కాలానికి తగిన ఆహారం తీసుకుంటే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకప్పుడు సీజనల్ పంటల ఆధారంగా ఆయా ఆకుకూరలు, కూరగాయలు తినేవారు. కానీ ఇప్పట్లో సీజన్ తో సంబంధం లేకుండా ఎన్నోరకాల కూరగాయలు, పండ్లు లభిస్తున్నాయి. వీటిని తినడం ఎంతో గర్వంగా ఫీలవుతుంటారు. అయితే పంచభూతాల ఆధారంగా మనిషి శరీరంలో వాత, పిత్త,కఫ అనే గుణాలు ఏర్పడుతాయి. సీజన్ కాని ఆహారం తింటే శరీరంలో ఈ గుణాలు సమతుల్యత కోల్పోతాయి. ఈ కారణంగానే జబ్బులు వస్తుంటాయి. అందుకే ఏ నెలలో ఏ ఆహారం తినకూడదో, ఏది తినాలో తెలుసుకోవడం ముఖ్యం(which food should not eat in which month). దీనివల్ల ఆయా ఆహారాలు దూరంగా ఉంచవచ్చు.

ప్రస్తుతం శ్రావణ,భాద్రపద మాసాల్లో వాత దోషం పెరిగే ప్రమాదం ఉంటుంది. శ్రావణంలో పొట్లకాయ , పాత బియ్యం, పాత గోధుమలు, కొత్తిమీర తినాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. మాంసాహారంకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రెడ్ మీట్ ను వీలైనంత అవాయిడ్ చెయ్యాలి. కూరగాయల్లో వంకాయ, టమాటా తినకపోవడం ఈ మాసాల్లో మంచిది. టీ, కాఫీ తాగే అలవాటు ఉన్నవారు ఒకటి, రెండు కప్పులకు మించి తాగకూడదు. భాద్రపదంలో వెల్లుల్లిని ఆహారంలో అధికంగా జోడించాలి. ఉల్లిపాయ, బీట్రూట్, ఎండు అల్లం, ఎండు మిర్చి, దేశవాళీ ధాన్యాలు తీసుకోవాలి. రాజ్మా తినే అలవాటు ఉన్నవారు సెప్టెంబర్ నెలలో తినకూడదు. దీని వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. చల్లగా ఉన్నవి, ఘాటైన రుచి కలిగినవి తినకూడదు. తాగకూడదు.

ఆశ్వీజ, కార్తీక మాసాల్లో పిత్త దోషం అధికమయ్యే ప్రమాదం ఉంటుంది. బాగా ఉడికించిన తీపి, కారం గల ఆహారాన్ని తీసుకోవాలి. పాలు, పెసలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, బార్లీ, గోధుమలు తినాలి. పెరుగు, బెండకాయ, క్యాబేజీ, శనగలు మొదలైనవి పైత్యాన్ని పెంచుతాయి. వీటిని తినకూడదు. టీ కాఫీలు కూడా అవాయిడ్ చెయ్యాలి. కార్తీక మాసంలో అయితే ఆవు నెయ్యి, కొబ్బరినూనె, వాల్నట్స్ తీసుకోవాలి. తీపి పదార్థాలు బాగా తీసుకోవచ్చు. పులుపు, కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినకూడదు.

Viral Video: ఇతడు కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నాడు.. వేరే ఎవరైనా అయితే గుండె ఆగి పైకి పోయేవాళ్ళే.. చెట్టుకింద కూర్చున్న వ్యక్తికి ఏం జరిగిందో చూస్తే..



మార్గశిర మాసంో వాత, పిత్త దోషాలు, పుష్యమాసంలో కఫ, పిత్త దోషాలు పెరిగే అవకాశం ఉంటుంది. నువ్వులు, మినప్పప్పు, పెరుగు, బెల్లం, నూనె పదార్థాలు తినచ్చు. అల్లం, యాలకులు బాగా ఉపయోగించవచ్చు. ఉప్పు, కారం బాగా తినాలి. చల్లనీరు, శీతలపానీయాలు, పాలు పాల ఉత్పత్తులు, తక్కువగా తీసుకోవాలి. పుష్యమాసంలో వేడిచేసే ఆహారం తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పాలు, పాల ఉత్పత్తులు, బెల్లం తినాలి. మొక్కజొన్న, బార్లీ వంటివి తినకూడదు, చల్లగాలికి దూరంగా ఉండాలి. పగటి నిద్ర ఈ మాసాలలో మంచిది కాదు.

మాఘ, పాల్గున, చైత్ర మాసాల్లో కఫ దోషం ఎక్కువ అవుతుంది. ఆవాలు, బత్తాయి, డ్రైఫ్రూట్స్, అల్లం, మిరియాలు, లవంగాలు, మసాలా ఆహారాలు తినాలి. శరీరానికి భారం పెంచే ఆహారాలు తీసుకోకూడదు. ముఖ్యంగా చక్కెర, ఉప్పు తక్కువ తినాలి. పాల్గున మాసంలో సగ్గుబియ్యాన్ని, సొంపును ఆహారంలో భాగం చేసుకోవాలి. వేడిగా, కారంగా ఉన్న వాటిని, మసాలాలను తినడం ఆపాలి. కాఫీ, టీ లు పరిమితంగా ఉండాలి. చైత్రమాసంలో మజ్జిగ, లస్సీ, నిమ్మరసం, సహజసిద్దమైన చల్లని పానీయాలు తాగాలి. బార్లీ, గోధుమలు ఆహారంలో చేర్చుకోవాలి. మినప్పప్పు, రాజ్మా, శనగలు, వేపుళ్ళకు దూరంగా ఉండాలి.

వైశాఖం, డైష్ట్య మాసాలలో వాతం, కఫం పెరుగుతుంది. రోజులో 8-10గ్లాసుల నీరు, కొబ్బరి, అరటిపండు, కొబ్బరినీరు మొదలైన శరీరానికి చలువ చేసేవి తీసుకోవాలి. ప్రోటీన్లకు బదులు పప్పు ధాన్యాలు తినాలి. ఎండలో ఎక్కువ ఉండకూడదు. కారం, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినకూడదు. దోసకాయ, బార్లీ, అరటి, పైనాపిల్, పుచ్చకాయ తినాలి. బేకరీ ఆహారాలు, వేపుళ్ళకు దూరంగా ఉండాలి. ఆషాడమాసంలో అరటి, బొప్పాయ, పుచ్చకాయ, కొబ్బరి, అన్నం తినాలి. పులుపు, ఉప్పు, చేదు మానుకోవాలి. జీడిపప్పు, బాదం, డ్రై ఫ్రూట్స్ తక్కువగా తినాలి. కారం, వేపుళ్ళు తినకూడదు.

Health Tips: వర్షాకాలంలో అందరికీ ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఇదే.. ఈ సమస్య రాకూడదంటే..


Updated Date - 2023-07-30T14:17:06+05:30 IST