ఒంటరితనం వేధిస్తోంది.. వధువు కావాలంటూ ఇచ్చిన ఒక్క ప్రకటనే.. ఆ 60 ఏళ్ల వృద్ధుడి జీవితాన్ని ఎలా మార్చేసిందంటే..!
ABN , First Publish Date - 2023-02-18T19:25:59+05:30 IST
అతడి వయస్సు 60ఏళ్లు. భార్య లేకపోవడంతో ముసలితనంలో అతడి బాగోగులు చూసుకునేవారు కరువయ్యారు. ఒంటరితనం వేధిస్తుండడంతో ఓ తోడు కావాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ..
అతడి వయస్సు 60ఏళ్లు. భార్య లేకపోవడంతో ముసలితనంలో అతడి బాగోగులు చూసుకునేవారు కరువయ్యారు. ఒంటరితనం వేధిస్తుండడంతో ఓ తోడు కావాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సోషల్ మీడియాలోని వివిధ మ్యాట్రిమోనీ వైబ్‌సైట్లను సంప్రదించాడు. చివరకు తనకు వధువు కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. అయితే ఈ ప్రకటన చివరకు అతడి జీవితాన్ని ఎలా మార్చిందంటే..
ముంబైకి (Mumbai) చెందిన ఓ 60ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా జీవనం సాగిస్తుండేవాడు. వృద్ధాప్యంలో అతడికి తోడు ఎవరూ లేకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి (Extreme mental stress) గురయ్యేవాడు. ఒంటరితనంతో రోజూ రోజుకూ మరింత ఆందోళనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో తనకు తోడు కావాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సోషల్ మీడియాలో పలు మ్యాట్రియోనియల్ వెబ్‌సైట్లలో (Matrimonial websites) అమ్మాయిల కోసం వెతికాడు. చివరకు ఓ వెబ్‌సైట్‌లో తనకు వధువు (bride) కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. ఇచ్చిన కొన్ని గంటలకు ఓ మహిళ నుంచి.. హాయ్! అంటూ మెసేజ్ వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అనంతరం రోజూ చాటింగ్ చేసుకునేవారు.
తన అభిప్రాయాన్ని మహిళకు తెలియడంతో ఆమె కూడా పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రోజూ ఆమెతో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. ఇటీవల ఈ చాటింగ్.. వీడియో కాల్స్ (Video calls) వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఓ రోజు సదరు మహిళ.. తన మనసులో మాట బయటపెట్టింది. దుస్తులు లేకుండా వీడియో కాల్ చేసుకుందామని కోరింది. ఇందుకు వృద్ధుడు వెంటనే ఓకే చెప్పేశాడు. ఇద్దరూ చాలా సేపు దుస్తులు లేకుండా వీడియో కాల్ (Indecent video calls) చేసుకున్నారు. మరుసటి రోజు ఆమె నుంచి వృద్ధుడి వాట్సప్‌కు ఓ వీడియో వచ్చింది.
అందులో తనను తాను దస్తులు లేకుండా చూసుకుని ఖంగుతిన్నాడు. మరుక్షణంలో ఆమె నుంచి మరో మెసేజ్ వచ్చింది. ‘‘అర్జంట్‌గా నేను అడిగిన డబ్బులు పంపించు.. లేదంటే నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తా’’.. అని బెదిరించింది. ఇలా మొత్తం సుమారు రూ.60లక్షల (60 lakh rupees) వరకూ రాబట్టింది. అయినా ఇంకా డబ్బు కావాలని బెదిరిస్తుండడంతో.. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ మహిళ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.