Viral Video: వారెవ్వా.. ఏం టెక్నిక్ బాసూ.. చేతివేలికి పెట్టిన రింగు.. ఇలా ఇరుక్కుపోతే.. నొప్పి లేకుండా ఎంత ఈజీగా తీశాడో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-04-13T20:55:14+05:30 IST
ప్రధానంగా ఉంగరాన్ని మధ్య వేలు, చిటికెన వేలుకి మధ్యలో ఉన్న వేలుకి పెట్టుకోవాలి. అందుకే ఆ వేలుకి ఉంగరం వేలు అని పేరు వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధానంగా ఉంగరాన్ని మధ్య వేలు, చిటికెన వేలుకి మధ్యలో ఉన్న వేలుకి పెట్టుకోవాలి. అందుకే ఆ వేలుకి ఉంగరం వేలు అని పేరు వచ్చింది. అయితే, ఇలాంటి సమయంలోనే ఏ చేతి ఉంగరం వేలుకి పెట్టుకోవాలనే సందేహం చాలా మందికి వస్తుంది. ఎడమ చేతి ఉంగరం వేలుకి మాత్రమే రింగ్ పెట్టుకోవాలి. మిగతా వేళ్ళకు పెట్టుకున్న సరే ఎడమ చేతి ఉంగరం (Ring) వేలుకి పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఉంగరం వేలు నుంచి వెళ్లే నాడీ నేరుగా హృదయానికి చేరుతుంది. అందుకే వివాహం సమయంలో జరిగే ప్రధానం సమయంలో వధూవరులు ఒకరి చేతికి మరొకరు ఉంగరం వేలుకి రింగ్ తొడిగితే ఆ స్పందనలు గుండెకు చేరతాయని ఆ విధంగా పెడుతుంటారు. ఇక చాలామంది ఆర్భాటం కోసం చేతికి ఉన్న అన్ని వేళ్ళకు ఉంగరాలు వేస్తుంటారు అది వేరే విషయం అనుకోండి. ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ చేతివేలికి పెట్టిన రింగు ఇరుక్కుపోతే.. దాన్ని తీయడానికి ఎన్నిపాట్లు పడాల్సి వస్తాదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని ఫీట్లు చేసినా.. ఒక్కొసారి ఉంగరం రాదు కూడా. దానితోడు భరించలేని నొప్పి సైతం ఉంటది.
పొరపాటున చిన్న సైజు ఉంగరాన్ని వేసుకోవడం వల్ల, వేళ్ళకు వేసుకున్న రింగ్ చాలా రోజులుగా అలాగే ఉండిపోవడంతో వాపు రావడంతోనే అవి ఇరుక్కుపోతుంటాయి. ఆ సమయంలో వాటిని చేతి వేళ్ళ నుంచి తొలగించడం అంత సులువు కాదు. ఇక అలా ఇరుక్కుపోయిన ఉంగరాన్ని తీయడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిలో ప్రధానమైన వేళ్ళకు సబ్బు, వాజ్లైన్, హ్యాండ్ లోషన్, బట్టర్, షాంపులు, పెట్రోలియం జెల్లీ తదితర జారుడు స్వభావం గల వాటిని రాస్తుంటాం. కొన్నిసార్లు ఈ ట్రిక్స్ పని చేస్తాయి కూడా. కానీ, చాలా సందర్భాల్లో తీవ్ర నొప్పిని మిగిలిస్తాయి. అయితే, ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ వీడియో ద్వారా ఎలాంటి నొప్పి లేకుండా ఎంత ఈజీగా తీయ్యోచ్చొ మీరే చూడండి. చిన్న రిబ్బన్ సాయంతో చేతి వేలికి ఇరుక్కుపోయిన రింగ్‌ను చాలా సింపుల్‌గా తీయడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత వారెవ్వా.. ఏం టెక్నిక్ బాసూ..! అని చెప్పాల్సిందే. ఎప్పుడైనా మీ చేతి వేలికి కూడా ఇలా ఉంగరం ఇరుక్కుపోతే ఇలాగే ట్రై చేయడం బెటర్ ఏమో.. ఒకసారి ఈ వీడియో చూసి మీరే తేల్చుకోండి.