కూతురు కిడ్నాప్ కేసులో కోర్టుకు హాజరైన తండ్రి.. భర్త ఇంటికి వచ్చే వరకూ చెప్పులు వేసుకోనన్న భార్య.. అసలు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-01-21T17:05:28+05:30 IST
ఇలాంటి సమస్య వస్తుందని ఆ దంపతులు కలలో కూడా ఊహించలేదు. వీరి కూతురుని వేరే వర్గానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం బాలికతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఈ కేసులో..
ఇలాంటి సమస్య వస్తుందని ఆ దంపతులు కలలో కూడా ఊహించలేదు. వీరి కూతురుని వేరే వర్గానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం బాలికతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఈ కేసులో తాజాగా నిందితుడు కోర్టుకు హాజరయ్యాడు. అదే సమయంలో బాలిక తండ్రి కూడా కోర్టుకు హాజరయ్యాడు. అయితే రాత్రవుతున్నా ఇంటికి రాలేదు. తన భర్త వచ్చే వరకూ చెప్పులు వేసుకోనని భార్య శపథం చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మెయిన్‌పురి పరిధిలో ఓ వ్యక్తి తన భార్య, కూతురుతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి కూతురును.. వేరే వర్గానికి చెందిన ఓ యువకుడు (young man) కొన్ని నెలల కిందట మాయమాటలు చెప్పి ప్రలోభపెట్టాడు. తర్వాత బాలికను (girl) తన వెంట తీసుకుని వెళ్లాడు. అనంతరం బాలికతో శారీరక సంబంధం (physical contact) కూడా పెట్టుకున్నాడు. అప్పట్లో ఈ ఘటనపై పోలీసులు నిందితుడిపై కేసులు కూడా నమోదు చేసి, జైలుకు పంపారు. తర్వాత కొన్నాళ్లకు నిందితుడు బెయిల్‌పై (Bail) బయటకు వచ్చాడు. మూడు రోజుల క్రితం కోర్టు వాయిదా నిమిత్తం నిందితుడు కోర్టుకు హాజరయ్యాడు. అలాగే బాలిక తండ్రి కూడా కోర్టుకు చేరుకున్నాడు.
అయితే కోర్టుకు వెళ్లిన బాధితురాలి తండ్రి రాత్రి అవుతున్నా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చాలా ప్రాంతాల్లో విచారించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడి ఆచూకీ లభించలేదు. తన భర్త ఇంటికి వచ్చే వరకూ తాను చెప్పులు వేసుకోనని భార్య శపథం చేసింది. పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు.. బాలిక తండ్రి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.
గర్భిణికి ఆపరేషన్ చేసి, పిండాన్ని పెంపుడు కుక్కకు తినిపించిన వైద్యులు.. 11 రోజుల తర్వాత చూస్తే..