HYD: 11 నెలలపాటు సైకిల్‌పై దేశాన్ని చుట్టివచ్చిన యువకుడు
ABN , First Publish Date - 2023-11-15T10:49:53+05:30 IST
పట్టుదల, అనుకున్నది సాధించాలనే తపన ఉంటే ఎంతటి కష్టమైన లక్ష్యాన్ని అయినా సునాయాసంగా సాధించవచ్చని నిరూపించాడు
మదీన(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): పట్టుదల, అనుకున్నది సాధించాలనే తపన ఉంటే ఎంతటి కష్టమైన లక్ష్యాన్ని అయినా సునాయాసంగా సాధించవచ్చని నిరూపించాడు పాతబస్తీ యువకుడు. 11నెలలపాటు సైకిల్‌పై భారతదేశం అంతటా తిరిగి వచ్చాడు. కందికల్‌గేట్ ప్రాంతానికి చెందిన ఏదుల ప్రవీణ్(Edula Praveen) బీకాం పూర్తి చేశాడు. జనవరి 16న సైకిల్‌పై దేశయాత్రకు బయలుదేరాడు. 29 రాష్ర్టాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలను చుట్టి రెండురోజుల క్రితం ఇంటికి చేరిన ప్రవీణ్‌ను స్థానికులు, బస్తీవాసులు ఘనంగా సత్కరించారు. నేపాల్, చైనా సరిహద్దుల వరకు వెళ్లాడు. మణిపూర్, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ర్టాల ప్రజలు జీవన శైలితోపాటు విభిన్నమైన జమ్ము కశ్మీర్ ప్రజల స్థితిగతులను కూడా స్వయంగా తిలకించడం సంతోషంగా ఉందని తెలిపాడు.