Share News

IAS Officer Video: ఐఏఎస్ ఆఫీసర్‌వు అయి ఉండి ఇవేం పనులయ్యా..? ఇది కరెక్టేనా..? అంటూ నెట్టింట పేలుతున్న సెటైర్ల వెనుక..!

ABN , First Publish Date - 2023-10-26T13:25:37+05:30 IST

అతనో ఐఏఎస్ ఆఫీసర్‌ (IAS Officer). ఢిల్లీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కానీ, ఇటీవల అతడు చేసిన పని ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. ఐఏఎస్ ఆఫీసర్‌వు అయి ఉండి ఇవేం పనులయ్యా..? ఇది కరెక్టేనా..? అంటూ అతనిపై నెట్టింట సెటైర్లు వేస్తున్నారు.

IAS Officer Video: ఐఏఎస్ ఆఫీసర్‌వు అయి ఉండి ఇవేం పనులయ్యా..? ఇది కరెక్టేనా..? అంటూ నెట్టింట పేలుతున్న సెటైర్ల వెనుక..!

IAS Officer Video: అతనో ఐఏఎస్ ఆఫీసర్‌ (IAS Officer). ఢిల్లీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కానీ, ఇటీవల అతడు చేసిన పని ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. ఐఏఎస్ ఆఫీసర్‌వు అయి ఉండి ఇవేం పనులయ్యా..? ఇది కరెక్టేనా..? అంటూ అతనిపై నెట్టింట సెటైర్లు వేస్తున్నారు. ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి గానీ, పనిచేసే చోట ఇలాగేనా ప్రవర్తించేది? అని విమర్శిస్తున్నారు కూడా. అసలు ఆ ఐఏఎస్ ఆఫీసర్‌ ఎవరు? నెట్టింట పేలుతున్న సెటైర్ల వెనుక కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Viral Video: ఇదేం వింత బాబోయ్.. ఇవి ఎలుకలా..? జింకలా..? ఈ వీడియోను చూసిన తర్వాత చెప్పగలిగితే మీరు తెలివైన వాళ్లే..!


అతని పేరు లక్షయ్ సింఘాల్ (Lakshay Singhal). ఢిల్లీలో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, లక్షయ్ తన మార్గదర్శకుడు, చిన్ననాటి గురువు అయిన ఓ పూజారి (Priest) పై చూపించిన అభిమానమే ఇప్పుడు అతనికి తంటాలు తెచ్చిపెట్టింది. ఆ పూజారిని నేరుగా తన కార్యాలయానికి తీసుకొచ్చిన లక్షయ్.. ఏకంగా తన కుర్చీలో కూర్చొబెట్టాడు. ఆ తర్వాత శాలువా, పూలదండతో సత్కరించాడు. ఆ సమయంలో పూజారికి వంగి మరీ దండాలు పెట్టడం మనం చూడొచ్చు. ఐఏఎస్ అధికారి కూర్చోవాల్సిన కుర్చీలో ఓ పూజారి కూర్చున్న ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది.

Viral Video: ప్రేయసి కోసం చేసిన అప్పులను తీర్చలేక.. ఆ ప్రియుడు చేసిన నిర్వాకం చూస్తే నవ్వాపుకోలేరు..!

నెటిజన్లు లక్షయ్‌ నిర్వాకంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌వు అయి ఉండి ఇవేం నమ్మకాలు అంటూ మండిపడుతున్నారు. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో అటు ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. దాంతో భవిష్యత్ మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని లక్షయ్‌ను వార్న్ చేసినట్లు తెలిసింది. ఇక ఈ వీడియోపై లక్షయ్ సింఘాల్ మాట్లాడుతూ.. "ఆయన నా చిన్ననాటి గురువు. ఆయనను గౌరవించాలనే ఉద్దేశంతోనే ఆఫీస్‌కు ఆహ్వానించాను. నా కాలేజీ రోజుల్లో సివిల్స్‌కు ప్రిపేర్ కావాలని నన్ను ప్రోత్సాహించిన ఏకైక వ్యక్తి ఆయనే. ఇది కేవలం గౌరవంతో చేసింది మాత్రమే. ఎక్కడ నా అధికారులను దుర్వినియోగం చేయలేదు" అని చెప్పుకొచ్చాడు. కాగా, లక్షయ్ సింఘాల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 2019 బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్.

Crime: పోలీసుల ముందు నిల్చున్న ఇతడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ.. అతడి ఇంట్లో వెతికితే ఏం బయటపడ్డాయో తెలిస్తే..!

Updated Date - 2023-10-26T13:51:54+05:30 IST