అత్తారింటికి వెళ్తూ సడన్‌గా కారును ఆపమన్న నవ వధువు.. చెట్ల పొదల్లోకి వెళ్లి ఎంతకూ రాకపోవడంతో వరుడు కూడా వెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2023-02-16T21:25:06+05:30 IST
వివాహ సమయాల్లో కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కట్నకానుకల విషయంలో తేడా వచ్చి.. పెళ్లి పీటలపై వివాహాలు ఆగిపోవడం జరుగుతుంటుంది. అలాగే కొందరు వధూవరులు తీరా తాళి కట్టే సమయంలో.. సినిమా తరహాలో రివర్స్ అవుతుంటారు. ఇలాంటి ..
వివాహ సమయాల్లో కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కట్నకానుకల విషయంలో తేడా వచ్చి.. పెళ్లి పీటలపై వివాహాలు ఆగిపోవడం జరుగుతుంటుంది. అలాగే కొందరు వధూవరులు తీరా తాళి కట్టే సమయంలో.. సినిమా తరహాలో రివర్స్ అవుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వరుడితో పాటూ అత్తారింటికి కారులో బయలుదేరిన వధువు.. మార్గ మధ్యలో వరుడికి షాక్ ఇచ్చింది. చెట్ల పొదల్లోకి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో.. చివరకు చూడటానికి వెళ్లిన వరుడు షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్ జిల్లా మౌయిమా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువకుడి వివాహం (marriage).. ఇదే ప్రాంతానికి చెందిన యువతితో ఆదివారం ప్రతాప్‌గఢ్‌లో జరిగింది. బంధువులు, సన్నిహితులు, స్నేహితులు హాజరై.. నిండు నూరేళ్లూ పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కొత్త జంటను ఆశీర్వదించారు. వివాహానంతరం వధువు.. వరుడితో పాటూ (bride and groom) కారులో సోమవారం అత్తారింటికి బయలుదేరింది. ఇద్దరూ సరదా సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో కారు మార్గ మధ్యలోకి చేరుకుంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో వధువు.. సడన్‌గా కారు ఆపమని చెప్పింది. టాయిలెట్‌కు వెళ్లొస్తా అని చెప్పి.. పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లింది.
అయితే ఎంతకీ తిరిగిరాకపోవడంతో వరుడు కంగారు పడ్డాడు. ఏమైందబ్బా... అనుకుంటూ పొదల వద్దకు వెళ్లి చూశాడు. అయితే అక్కడ ఆమె (bride disappearance) కనిపించలేదు. కంగారుపడి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వెతికాడు. అయినా వధువు మాత్రం కనిపించలేదు. అక్కడ ఉన్న కొందరు స్థానికులను విచారించగా షాకింగ్ నిజం తెలిసింది. ‘‘ ఎర్రచీర కట్టుకున్న ఓ అమ్మాయి.. ఇప్పుడే ఎవరో యువకుడి బైకులో వెళ్లింది’’ అని వారు చెప్పడంతో వరుడు ఖంగుతిన్నాడు. వెంటనే ఈ విషయాన్ని వధువు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. చివరకు వరుడు ఒక్కడే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం వధువు కోసం అంతా గాలించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందా.. లేదా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.