Viral Video: బాబోయ్.. ఇదేం వింత.. అచ్చం మనిషిలాగానే ఉన్న ఈ వెరైటీ జంతువేంటంటే..!
ABN , First Publish Date - 2023-08-05T15:30:16+05:30 IST
తూర్పు చైనాలోని హాంగ్‌జౌ జంతుప్రదర్శనశాలలో ఓ జంతువు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆ జూలోని ఓ ఎలుగుబంటి అచ్చం మనిషిని పోలి ఉంది. మనిషిలాగానే నడుస్తూ హావభావాలను ప్రదర్శిస్తోంది. ఆ వీడియోపై జనాలు ట్రోలింగ్ ప్రారంభించారు. మనిషికి ఎలుగుబంటి డ్రెస్ వేసి జనాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
తూర్పు చైనా (East China)లోని హాంగ్‌జౌ (Hangzhou Zoo) జంతుప్రదర్శనశాలలో ఓ జంతువు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆ జూలోని ఓ ఎలుగుబంటి (Human like Bear) అచ్చం మనిషిని పోలి ఉంది. మనిషిలాగానే నడుస్తూ హావభావాలను ప్రదర్శిస్తోంది. ఆ వీడియోపై జనాలు ట్రోలింగ్ ప్రారంభించారు. మనిషికి ఎలుగుబంటి డ్రెస్ వేసి జనాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అయితే అది నిజమైన ఎలుగుబంటేనని మనిషి కాదని జూ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు.
మలయన్ సన్ ఎలుగుబంట్లు (Sun Bear) కాస్త మనుషులను పోలి ఉంటాయి. వీటిని ప్రపంచంలోనే అతి చిన్న ఎలుగుబంట్లుగా (Smallest bears) పరిగణిస్తారు. అది నిజమైన ఎలుగుబంటే అని నిర్ధారిస్తూ యూకేలోని ప్యారడైజ్ వైల్డ్‌లైఫ్ పార్క్ (Paradise Wildlife Park) ఓ వీడియోను షేర్ చేసింది. ``ఇది ఎలుగుబంటే అని మేం నిర్ధారించగలం`` అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వీడియోలోని మలయన్ సన్ ఎలుగుబంటి చూడడానికి అచ్చం మనిషిలాగానే కనిపిస్తోంది.
Viral Video: ఈ కుక్క ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. భారీ వరద నుంచి ఈ కుక్క ఎలా తప్పించుకుందో చూడండి..
ఈ వైరల్ వీడియో (Viral Video) లక్షల వ్యూస్ సాధించింది. ఈ వీడియోను ఇప్పటివరకు 43 వేల మంది లైక్ చేశారు. ఈ వింత జంతువును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ``వావ్.. అది నిజంగా ఎలుగుబంటేనా. నేను నమ్మలేకపోతున్నా``, ``ఇలాంటి ఎలుగుబంట్ల గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం``, ``అది చాలా అందంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.