Share News

Baby Girl Survives Miraculously: ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి.. లక్కీగా ప్రాణాలతో బయటపడిన ఆరు నెలల చిన్నారి!

ABN , First Publish Date - 2023-11-05T13:21:20+05:30 IST

ఓ తల్లి (Mother) తన ముగ్గురు పిల్లలతో (Children) కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం జార్ఖండ్‌ (Jharkhand) లో చోటు చేసుకుంది.

Baby Girl Survives Miraculously: ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి.. లక్కీగా ప్రాణాలతో బయటపడిన ఆరు నెలల చిన్నారి!

Baby Girl Survives Miraculously: ఓ తల్లి (Mother) తన ముగ్గురు పిల్లలతో (Children) కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం జార్ఖండ్‌ (Jharkhand) లో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో నీటిలో మునిగి తల్లితో పాటు ఇద్దరు పిల్లలు చనిపోయారు. కానీ, లక్కీగా ఆరు నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడింది (Baby Girl Survives Miraculously). వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని పాలము జిల్లా హైదర్‌నగర్ పోలీస్ స్టేషన్ (Haidernagar police station) పరిధిలోని కరీమండిహ్ గ్రామంలో ఈ విషాద సంఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఒక చెరువు వద్దకు వెళ్లింది. మొదట నాలుగేళ్ల కుమార్తెను చెరువులోకి తోసేసింది. ఆ తర్వాత రెండున్నర ఏళ్ల కుమారుడిని కూడా నీటిలోకి తోసింది.

WhatsApp groups: ఎవరు పడితే వాళ్లు వాట్సప్ గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేస్తున్నారా..? ఈ ట్రిక్‌ను కనుక వాడితే..!

అనంతరం ఆరు నెలల చిన్నారిని చేతిలో పట్టుకుని ఆమె కూడా చెరువులోకి దూకింది. కానీ, ఆమె చేతిలోని పసిపాప జారి చెరువుగట్టుపై పడింది. దాంతో లక్కీగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. మరోవైపు చెరువులో పడి మునిగిన మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు చినిపోయారు. ఈ ఘటనతో కరీమండిహ్ గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, కుటుంబ కలహాల కారణంగానే ఆ మహిళ తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి అజయ్ కుమార్ తెలిపారు.

Viral Video: చేత్తో ఇటుకను పట్టుకుని మరీ భార్యాభర్తల మధ్య బిగ్ ఫైటింగ్.. వీడియోను చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..!

Updated Date - 2023-11-05T13:24:43+05:30 IST