Jr NTR: భారతీయ సినిమాను అతడు మాత్రమే ఏకం చేయగలడు

ABN , First Publish Date - 2023-01-14T16:26:06+05:30 IST

ఆర్ఆర్ఆర్ సినిమా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సినీ ప్రపంచంలోనే విశిష్ట పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్‌ను కైవసం చేసుకుంది. బెస్ట్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అవార్డును సొంతం చేసుకుంది.

Jr NTR: భారతీయ సినిమాను అతడు మాత్రమే ఏకం చేయగలడు

ఆర్ఆర్ఆర్ సినిమా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సినీ ప్రపంచంలోనే విశిష్ట పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్‌ను కైవసం చేసుకుంది. బెస్ట్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందంపై సామాన్యులతో సహా సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) ని పొగిడాడు. ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమలను ఏకం చేసే సత్తా అతడికీ మాత్రమే ఉందన్నాడు.

ఆర్ఆర్ఆర్ జపాన్‌లో సంచలన విజయం సాధించింది. 500మిలియన్ జపనీస్ యెన్ వసూళ్లను రాబట్టింది. ఆ స్థాయి కలెక్షన్స్‌ను రాబట్టడం అంత సులభం కాదని తారక్ తెలిపాడు. ‘‘భారతీయుల కంటే ఎక్కువగా జపనీయులు మా చిత్రంపై ప్రేమాభిమానాలు చూపించారు. అనంతరం విదేశీయులు సోషల్ మీడియాలో మాత్రమే మాట్లాడుకుంటున్నారనుకున్నాం. భారతీయుల స్నేహితులు చూస్తున్నామని భావించాం. ఈ ప్రేక్షకుల సంఖ్య అంచెలంచెలుగా పెరగడం ప్రారంభమైంది. ఇండియాలో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాళీ, భోజ్‌పురి వంటి ఇతర పరిశ్రమలు ఉన్నాయి. కానీ, రాజమౌళి మాత్రమే అన్ని ఇండస్ట్రీల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేశాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఏకం చేశాడు’’ అని తారక్ చెప్పాడు.

స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీత రామరాజు, కొమరం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని ‘ఆర్ఆర్ఆర్’ ను రూపొందించారు. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి తెరకెక్కించాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా సంచలన విజయం సాధించింది. రూ.1200కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Updated Date - 2023-01-14T16:28:01+05:30 IST