Viral Video: కోతి రూపంలో రోబోను చేసి చనిపోయిందన్నట్టుగా పడేశారు.. కోతుల గుంపు దాన్ని చూసి రోబో అని తెలియక ఏం చేశాయో చూస్తే..
ABN , First Publish Date - 2023-04-19T12:25:54+05:30 IST
కొండముచ్చులకు (Langurs) సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Viral Video: కొండముచ్చులకు (Langurs) సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఓ కోతి పిల్ల చనిపోయినట్లు పడి ఉండడం చూసిన ఆ గుంపు.. ఎమోషనల్‌గా ఫీల్ కావడం మనం వీడియోలో చూడొచ్చు. అయితే, ఆ కోతిపిల్ల అనేది నిజమైంది కాదు. అదొక రోబో. ఈ విషయం తెలియక ఆ కోతుల గుంపు దాన్ని నిజమని భావించి చాలా ఎమోషనల్ అవ్వడం వీడియోలో రికార్డైంది. ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ 'స్పై ఇన్ ది వైల్డ్' (Spy in The Wild) పేరిట రూపొందించిన డాక్యూమెంటరీ సిరీస్‌లో భాగంగా ఇలా కోతిని పోలిన రోబోను తయారు చేసి ఆ కొండముచ్చుల గుంపులో పడేసింది. దాన్ని చూసిన తర్వాత అవి ఎలా ప్రవర్తిస్తాయి అనేది చిత్రీకరించాలని ఆ డాక్యూమెంటరీ తాలూకు ఆలోచన.
ఇలాంటి సమయాల్లో ప్రధానంగా జంతువుల బిహేవియర్ (Behaviour) ఎలా ఉంటది అనేది తెలుసుకోవడం అన్నమాట. దీనిలో భాగంగా డ్యాక్యూమెంటరీ టీమ్ ఇలా కోతిని పోలిన రోబోను (Monkey Robot) తయారు చేసి.. కోతుల గుంపు ముందు పడేసింది. ఆ రోబోలో ఉన్న కెమెరాల ద్వారా అవి ఏం చేస్తాయనే దానిని ఆ బృందం చిత్రీకరించింది. ముందుగా ఓ కొండముచ్చు ఆ కోతిపిల్లను ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. అది ఎంతకు లేవకపోవడంతో దాన్ని అలాగే కింద ఉంచి కొద్దిసేపు ఆ గుంపు తదేకంగా చూసింది. మనం ఎలానైతే ఎవరైనా చనిపోయినప్పుడు మౌనంగా ఉండిపోతామో.. సేమ్ టు సేమ్ అవి కూడా అలాగే ముభావంగా ఉండిపోయాయి.
Viral Video: రైల్లో ఓ వృద్ధ జంట ప్రయాణం.. భర్త చేసిన పనిని దూరం నుంచి సీక్రెట్‌గా వీడియో తీశాడో ప్రయాణీకుడు.. నెట్టింట పోస్ట్ చేస్తే..
ఆ తర్వాత కొద్దిసేపటికి మరో కోతి వచ్చి అలా నేలపై అచేతనంగా పడి ఉన్న కోతిపిల్లను లేపేందుకు ప్రయత్నించింది. కానీ, అది ఎంతకు కదలకపోవడంతో అలా చూస్తూ ఉండిపోయింది. ఈ వీడియో పాతదే అయినా తాజాగా 'నేచర్ ఈజ్ అమేజింగ్' (Nature Is Amazing) అనే ట్విటర్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 2.36లక్షల వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.