Love Marriage: ఈ ప్రేయసి పంతం నెగ్గిందిగా.. పెళ్లి వద్దని ప్రియుడు పారిపోతున్నా.. ఆ ప్రేయసి 4 సార్లు వెతికి పట్టుకుని మరీ..
ABN , First Publish Date - 2023-05-01T19:51:20+05:30 IST
ప్రియురాలి నుండి పారిపోవాలని రన్నింగ్ లో ఉన్న ట్రైన్లో నుండి దూకేశాడు కానీ చివరికి..
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చూశారా? అందులో సాయి ధరమ్ తేజ్ ను సవతి తల్లి ఝాన్సీ అమ్మేసినప్పటి నుండి పాపం అతనికి కష్టాలు మొదలవుతాయి. పెళ్ళి చేయాలని అతన్ని వెంటాడి, వేటాడి ముప్పుతిప్పలు పెడుతారు. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటి సీన్ కాకపోయినా ఇంచుమించు పెళ్లి నుండి పారిపోవాలని ప్రయత్నించిన ఓ కుర్రాడి కథే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు పారిపోయాడు అతడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అతన్ని వదల్లేదు. నాలుగు సార్లూ అతన్ని వెంబడించి మరీ పెళ్ళి పీటలు ఎక్కింది. సోషల్ మీడియోలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ కు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఒడిశా(Odisha)లోని జస్పూర్(Jashapur) ప్రాంతంలో నివసిస్తున్న సునీత వయసు 22 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ పూర్తీ చేసిన ఆమె ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. దీంతో 2022 మార్చి నెలలో తమిళనాడులోని(Tamil Nadu) తిరుప్పూర్(Tiruppur) లో కుట్టు మిషన్ ఫ్యాక్టరీలో(stitching factory) పనికి చేరింది. బీహార్(Bihar) రాష్ట్రం సీతామర్హి(Sitamarhi) జిల్లా సోన్ బర్సా పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న పక్డియా గ్రామంలో చందన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని వయసు 22 సంవత్సరాలు. అతను కూడా సంపాదన కోసం తమిళనాడు వెళ్లి తిరుప్పూర్ లోని కుట్టు ఫ్యాక్టరీలో చేరాడు. సునీతకు, చందన్ కు అక్కడే పరిచయం అయ్యింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. అయితే వారి ప్రేమ మొదలైన ఐదు నెలలకే వారిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
Viral Photo: ఖరీదైన బహుమతులూ ఇవ్వలేదు.. నోరు తెరిచి చెప్పలేదు.. ఈ కుర్రాడి ప్రపోజల్ కు అమ్మాయి ఫిదా .. ఇంతకూ అతనేం చేశాడంటే..
ఆమెతో గొడవ పడలేక చందన్ తిరుప్పూర్ నుండి తన గ్రామానికి పారిపోయాడు. విషయం తెలుసుకున్న సునీత అతని వెనకే వెళ్ళింది. అయితే చందన్ గ్రామం నుండి అటునుంచి అటే లుథియానాకు(Lithuania) వెళ్ళాడు. సునీత కూడా అక్కడికి చేరుకుంది. అక్కడ ట్రైన్ లో ఉండగా చందన్ సునీతను చూశాడు. ఆమె నుండి తప్పించుకోవడానికి కదులుతున్న ట్రైన్లో(jumped from running train) నుండి దూకేశాడు. తరువాత పారిపోదామని ప్రయత్నించినా అతను దూకిన్పపుడు కాలుకు దెబ్బ తగలడంతో పరిగెత్తలేక సునీతకు దొరికిపోయాడు. ఆ తరువాత వారిద్దరూ కలసి ఇంటికి చేరుకున్నారు. ఆమెతో ఉండలేనని అనుకున్న చందన్ మళ్లీ అక్కడి నుండి పారిపోయాడు. దీంతో సునీత సోన్ బర్సా పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన పరిస్థితి చెప్పి చందన్ ను వెతికిపట్టుకోమని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు చందన్ కోసం వెతుకులాట ముమ్మరం చేసి ఎట్టకేలకు అతన్ని పట్టుకుని పోలిస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. పోలిస్ స్టేషన్ లోనే పోలీసుల సమక్షంలో వారిద్దరి పెళ్ళి జరిపించారు. దీని తరువాత ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో శివాలయంలో ఈ జంట పెళ్లి జరిగింది. ఈ విషయం మొత్తం తెలిసినవారు అమ్మాయి తన పంతం నెగ్గించుకుందిగా అని అంటున్నారు.