Share News

Mad Love: 4 నెలల క్రితమే ప్రేయసికి పెళ్లి.. అత్తారింట్లో ఉన్న ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన కుర్రాడు.. చివరకు..!

ABN , First Publish Date - 2023-11-28T16:20:23+05:30 IST

ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లయినా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఆమెను మర్చిపోలేకపోయాడు. ఆమెను వెతుక్కుంటూ ఏకంగా ఢిల్లీకే వెళ్లాడు. కానీ అక్కడ జరిగింది తెలిస్తే..

Mad Love: 4 నెలల క్రితమే ప్రేయసికి పెళ్లి.. అత్తారింట్లో ఉన్న ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన కుర్రాడు.. చివరకు..!

ఈ ప్రపంచంలో చాలా సమస్యలకు పరిష్కారం ప్రేమే. అందరూ ప్రేమతో అన్యోన్యంగా ఉంటే ఎలాంటి గొడవలు, పోట్లాటలు ఉండవు. కానీ యువతీయువకుల మధ్య ప్రేమ మాత్రం సంతోషం కంటే దుఃఖానికే ఎక్కువ దారితీస్తుంది. దీనికి కారణం ప్రేమించుకున్న ప్రతి జంట జీవితంలో ఒక్కటి కాలేకపోవడమే. తను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లయినా ఓ ప్రియుడు ఆమెను మర్చిపోలేకపోయాడు. ఆమెను వెతుక్కుంటూ ఏకంగా ఢిల్లీకే వెళ్లాడు. కానీ అక్కడ జరిగిన సంఘటసలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ(Delhi)లో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. హైదరాబాద్ లో షా బాబు అనే 23ఏళ్ళ కుర్రాడు టైలరింగ్ పని చేస్తున్నాడు. అతని నివాసానికి పక్కనే హస్మత్ జహాన్ అనే యువతి కుటుంబం కూడా నివసిస్తుండేది. ఇరుగు పొరుగు వారు కావడంతో షా బాబుకు, హస్మత్ జహాన్ కు పరిచయం పెరిగి ప్రేమగా మారింది. కానీ హస్మత్ జహాన్ కు ఆమె తల్లిదండ్రులు మహ్మద్ మున్నా అనే వ్యక్తితో పెళ్లి నిర్ణయించారు. ఆ విధంగానే మున్నాతో పెళ్లి జరిపించారు. అనంతరం మున్నా, హస్మత్ జహాన్ ను ఢిల్లీ తీసుకెళ్ళాడు. ఢిల్లీలో బులందర్ మసీద్ సమీపంలో నివసిస్తుండేవారు. తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక షా బాబు చాలా బాధపడ్డాడు. ఆమెను వెతుక్కుంటూ ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. ఆమె ఇంటి చిరునామా కనుక్కుని ఆమెను కలిశాడు.

ఇది కూడా చదవండి: Coconut Oil: కొబ్బరి నూనె అసలు మంచిదేనా..? చాలా మందికి తెలియని నిజాలివి..!



షా బాబు, హస్మత్ జహాన్ తో మాట్లాడుతూ ఒక్కసారిగా ఉన్మాదానికి లోనయ్యాడు. తన దగ్గరున్న కత్తి బయటకు తీసి హాస్మత్ మీద దాడి చేశాడు. హస్మత్ ముఖం, తల, చేతులమీద కత్తిపోట్లు తగిలాయి. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షా బాబును కత్తితో సహా పట్టుకున్నారు. అనంతరం హస్మత్ ను ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని GTB ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హస్మత్ జహాన్ వేరే వ్యక్తిని పెళ్ళి చేకుకోవడంతో ఆమె మీద కోపంతోనే ఆ పని చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: Marriage Card: వధూవరులు ఇద్దరూ పీహెచ్‌డీలు చేస్తే ఇలాగే ఉంటుందేమో.. పెళ్లి కార్డును చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!


Updated Date - 2023-11-28T16:20:25+05:30 IST