కార్లు, బైకులతో ప్రమాదకర స్టంట్స్.. రూ.30 చెల్లించి మరీ చావు అంచును చూసొస్తున్నారు..!
ABN , First Publish Date - 2023-01-05T16:03:07+05:30 IST
వాహనాలతో వివిధ విన్యాసాలను చేసే వాళ్లను రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు రోడ్లపై చిత్రవిచిత్రమైన స్టంట్స్ (Amazing stunts) చేస్తూ.. కొన్నిసార్లు ప్రమాదానికి గురైన సందర్భాలు కూడా చాలా చూశాం. ఇంకొందరు..
వాహనాలతో వివిధ విన్యాసాలను చేసే వాళ్లను రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు రోడ్లపై చిత్రవిచిత్రమైన స్టంట్స్ (Amazing stunts) చేస్తూ.. కొన్నిసార్లు ప్రమాదానికి గురైన సందర్భాలు కూడా చాలా చూశాం. ఇంకొందరు పొట్టకూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ నిత్యం మృత్యువును పక్కనే పెట్టుకుని తిరుగుతుంటారు. మధ్యప్రదేశ్ కార్లు, బైకులతో కొందరు చేసిన ప్రమాదకర స్టంట్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది రూ.30 చెల్లించి మరీ చావు అంచును చూసొస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఎగ్జిబిషన్లు, జాతర తదితర వేడుకలు జరిగే ప్రాంతాల్లో.. కలపతో తయారు చేసిన గుండ్రటి బావిలో కార్లు, బైకులతో ప్రమాదకర విన్యాసాలు చేసే వారిని చాలా మంది చూసే ఉంటారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్‌లో జరిగిన ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral videos) అవుతున్నాయి. గ్వాలియర్‌లో జరుగుతున్న ట్రేడ్ ఫెయిర్‌లో కలపతో ఏర్పాటు చేసిన మృత్యు బావిలో రెండు బైకులు, కార్లు గుండ్రంగా తిరుగుతూ సందర్శకులను ఆకట్టుకోవడంతో పాటూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చూసే వాళ్లకు కూడా భయం కలిగేలా వారి విన్యాసాలు ఉన్నాయి. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితిలో.. వారు ఈ విన్యాసాలను ఎంతో ధైర్యంగా అవలీలగా చేసేస్తున్నారు.
సీసీ కెమెరాలను గమనించని పోలీసులు.. నడి రోడ్డుపై కారు ఆపి మరీ ఏం చేశారంటే..
నిర్వాహకుడు పింటు చౌహాన్ మాట్లాడుతూ, తాము ఈ విద్యను 25ఏళ్ల క్రితం కేరళలో నేర్చుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి ఎక్కడ జాతర నిర్వహించినా.. సామగ్రి, సిబ్బందితో పాటూ అక్కడికి చేరుకుంటామన్నారు. కలపతో బావిని నిర్మించేందుకు సుమారు 15రోజుల సమయం పడుతుందని చెప్పారు. బలమైన చెక్కలు, ఇనుప చువ్వలతో నిర్మించడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండదన్నారు. మొదట్లో కొంచెం భయంగా ఉండేదని కానీ.. ప్రస్తుతం అలవాటు అయిపోయిందన్నారు. కేవలం రూ.30లు చెల్లించి ఈ మృత్యు క్రీడను వీక్షించవచ్చని చెప్పారు. పొట్టకూటి కోసం తాము మృత్యువతో పోరాడుతూ అందరికీ వినోదాన్ని పంచుతున్నామని చెబుతున్నారు.
భర్తతో మాట్లాడిన తర్వాత తండ్రికి టీ ఇచ్చిన కూతురు.. కాసేపటి తర్వాత ఆమె చేసిన పనికి.. అంతా షాక్..