Viral Video: భారీ కొండచిలువతో ఆటలాడితే ఎలా బాసూ.. ఎంత కోపం వచ్చిందో చూడండి.. వైరల్ అవుతున్న భయంకర వీడియో!

ABN , First Publish Date - 2023-07-15T12:31:50+05:30 IST

సాధారణంగా పాములు అప్పుడప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. గ్రామాల్లో తరచుగా కనిపిస్తుంటాయి. అయితే కొండచిలువలు మాత్రం జనావాసాలకు దూరంగా అడవుల్లోనే నివసిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో కొండ చిలువలు కూడా ఆహారం కోసం అటవీ సమీప గ్రామాల్లోకి చొరబడుతున్నాయి.

Viral Video: భారీ కొండచిలువతో ఆటలాడితే ఎలా బాసూ.. ఎంత కోపం వచ్చిందో చూడండి.. వైరల్ అవుతున్న భయంకర వీడియో!

సాధారణంగా పాములు (Snakes) అప్పుడప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. గ్రామాల్లో తరచుగా కనిపిస్తుంటాయి. అయితే కొండచిలువలు (Pythons) మాత్రం జనావాసాలకు దూరంగా అడవుల్లోనే నివసిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో కొండ చిలువలు కూడా ఆహారం కోసం అటవీ సమీప గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తున్నాయి. అలాంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి (Python Videos).

భారీ ఆకారంతో ఉండే కొండ చిలువలు సాధారణంగా దూకుడుగా ఉండవు. రెచ్చగొడితే తప్ప మానవులకు హాని చేయవు. అలాంటి కొండచిలువతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వాటికి ఎంత కోపం వస్తుందో తెలియజేసే వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. Mike Holston అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. ఆ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన ఒట్టి చేతులతోనే కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కొండచిలువ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆ వ్యక్తిపై దాడి చేయడానికి పలు సార్లు ప్రయత్నించింది.

Viral Video: విమానంలో విరాళాలు అడుగుతున్న పాకిస్థాన్ వ్యక్తి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

కొండ చిలువ ఆగ్రహం చూసిన ఆ వ్యక్తి దానితో చాలా జాగ్రత్తగా వ్యవహరించి దానికి దొరక్కుండా తప్పించుకున్నాడు. చివరకు కొండచిలువను నోటి దగ్గర పట్టుకుని దానిని నియంత్రించాడు. జనావాసం నుంచి దానిని దూరంగా తరలించేందుకు దానిని ఓ గోనె సంచిలో వేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.5 లక్షల మంది లైక్ చేశారు. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.

Updated Date - 2023-07-15T12:31:50+05:30 IST