Height Increase Surgery: పొట్టిగా ఉంటే ఎవరూ ప్రేమించడం లేదట.. ఎత్తు పెరిగేందుకు రూ.1.35 కోట్లతో సర్జరీ.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..!
ABN , First Publish Date - 2023-04-15T15:12:07+05:30 IST
పొట్టిగా ఉంటే ఎవరూ ప్రేమించడం లేదట. 41ఏళ్లు వచ్చినా.. తోడు దొరకడంలేదట ఓ అమెరికన్‌కు.
ఇంటర్నెట్ డెస్క్: పొట్టిగా ఉంటే ఎవరూ ప్రేమించడం లేదట. 41ఏళ్లు వచ్చినా.. తోడు దొరకడంలేదట. దాంతో అతడు హైట్ పెరగాలనుకున్నాడు. దీనికోసం భారీ మొత్తం వెచ్చించడంతో పాటు బాధాకరమైన సర్జరీలు కూడా చేయించుకున్నాడు ఓ అమెరికన్‌కు. అది కూడా కేవలం 5 ఇంచుల ఎత్తు కోసం ఎంతో క్లిష్టతరమైన సర్జరీలు చేయించుకున్నాడు మనోడు. దానికోసం అతడు ఏకంగా రూ.1.35 కోట్లు ఖర్చు చేశాడు. వివరాల్లోకి వెళ్తే... అతడి పేరు మోసెస్ గిబ్సన్ (Moses Gibson). వృత్తిరీత్యా సాప్ట్ వేర్ ఇంజినీర్ (Software Engineer). కేవలం 5.5 అడుగుల ఎత్తు ఉండే గిబ్సన్‌కు హైట్ తక్కువ ఉన్నాననే దిగులు నీడలా వెంటాడింది. దాంతో అతడు హైట్ పెరిగేందుకు చేయని ప్రయోగం అంటూ లేదు. ఎంతో మంది వైద్యులను కలిశాడు. వారు ఏ మందులు వాడాలని చెబితే వాటిని తీసుకున్నాడు. కానీ, ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. దాంతో చివరగా సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అందుకోసం ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే.. ఖాళీ సమయంలో ఉబెర్ డ్రైవర్‌గా (Uber Driver) మరో జాబ్ (Job) కూడా చేశాడు. అలా 75 వేల డాలర్లు సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత 2016లో మొదటిసారి సర్జరీ చేయించుకున్నాడు. తద్వారా గిబ్స్ మూడు ఇంచులు పెరిగాడు. దాంతో అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ తర్వాత గిబ్స్‌కు ఇంకో రెండు ఇంచుల హైట్ పెరిగితే బాగుంటది కదా అనిపించింది. అంతే.. మళ్లీ మనోడు కష్టపడి మరికొంత సొమ్ము కూడబెట్టాడు. దాంతో ఈ ఏడాది మార్చిలో 98 వేల డాలర్లు ఖర్చు పెట్టి మరో సర్జరీ చేయించుకున్నాడు. ఈ సర్జరీ తర్వాత మరో రెండు ఇంచులు పెరిగాడు. ఇప్పుడు గిబ్స్ ఎత్తు 5 ఫీట్ల 10 ఇంచులకు చేరింది.
Viral Video: ఎన్ని సార్లు అడిగినా ముఖానికి చుట్టుకున్న స్కార్ఫ్‌ను తీసేయని ప్రేయసి.. అనుమానంతో ఆ ప్రియుడు ముసుగు తీసేసి చూస్తే..
ఈ సందర్భంగా గిబ్స్ మాట్లాడుతూ, తక్కువ హైట్ ఉండటంతో ఆత్మన్యూనతా భావం కలిగిందని మోసెస్ (Moses) అంటున్నాడు. ఒకనొక సందర్భంలో తనలో పూర్తిగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని.. ఆ సమయంలో మహిళలతో మాట్లాడేందుకు భయం వేసేదని తెలిపాడు. ఎవరితో అయినా డేట్ చేయాలన్న ఇబ్బందిగా గురయ్యేవాడినని చెప్పాడు. కానీ, సర్జరీల తర్వాత హైట్ పెరగడంతో ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసం (Confidence) పెరిగిందని గిబ్స్ చెబుతున్నాడు. ఇప్పుడు తనకొక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని మురిసిపోతున్నాడు. తాను ఎత్తు పెరగాలని అనుకున్నానని.. అందుకోసం శారీరకంగా ఎంత ఇబ్బంది పడ్డ, భారీ మొత్తం ఖర్చు అయినా వెనకడుగు వేయలేదని చెప్పుకొచ్చాడు.