తమ్ముడూ.. నా పిల్లల బాధ్యత నీదే.. బాగా చూసుకో.. అంటూ వీడియో పంపించి మరీ ఓ వ్యక్తి దారుణం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-01-07T18:35:17+05:30 IST

వారిది సాధారణ మధ్య తరగతి కుటుంబం. అన్నదమ్ములిద్దరూ టీ, మెకానిక్ దుకాణాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషిస్తుంటారు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబాల్లో ఇటీవల ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఆ కుంటుబంలోని పెద్ద కొడుకు..

తమ్ముడూ.. నా పిల్లల బాధ్యత నీదే.. బాగా చూసుకో.. అంటూ వీడియో పంపించి మరీ ఓ వ్యక్తి దారుణం.. అసలేం జరిగిందంటే..

వారిది సాధారణ మధ్య తరగతి కుటుంబం. అన్నదమ్ములిద్దరూ టీ, మెకానిక్ దుకాణాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషిస్తుంటారు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబాల్లో ఇటీవల ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఆ కుంటుబంలోని పెద్ద కొడుకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ‘‘తమ్ముడూ నా పిల్లల బాధ్యత నీదే.. బాగా చూసుకో.. అంటూ వీడియో పంపించి మరీ దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బ్యాగులో లక్ష రూపాయల నోట్ల కట్టలు.. కానీ నడిరోడ్డుపై బ్లేడుతో కోసుకుని ఓ యువకుడు దారుణం.. చివరకు..

indoor-crime-news.jpg

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి బ్రిలియంట్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో నివాసం ఉంటున్న సేవారామ్‌కు రాహుల్, రవి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సేవారామ్ గతంలో కూరగాయల దుకాణం నడిపేవాడు. అయితే వయసు రీత్యా ప్రస్తుతం ఇంటి వద్దే ఉండగా, పెద్ద కొడుకు పెద్ద కుమారుడు రాహుల్ మెకానిక్ షాపు (Mechanic shop) నిర్వహిస్తుండగా, రెండో కుమారుడు రవి టీ దుకాణం నడుపుతున్నాడు. రాహుల్‌కు ఎనిమిదేళ్ల లక్కీ అనే కొడుకు ఉన్నాడు. ఇదిలావుండగా, రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేశారనే కారణంతో ఇటీవల ఇండోర్ కార్పొరేషన్ అధికారులు (Corporation Officers).. సుమారు 10 దుకాణాలను తొలగించారు. అందులో రాహుల్ మెకానిక్ షాపు కూడా ఒకటి. ఉపాధి కోల్పోవడంతో రాహుల్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కుటుంబ పోషణ భారంగా మారిందని, షాపు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ అధికారులను వేడుకున్నాడు.

నువ్వు రావద్దు.. నేనే వస్తున్నా.. కింద ఉన్న ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఏడో అంతస్థు నుంచి దూకేశాడు.. పర్సులో దొరికిన లేఖలో..

అయినా వారు అనుమతి ఇవ్వలేదు. దీంతో మరింత మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఇటీవల ఓ రోజు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘‘దుకాణాన్ని ఎత్తేయడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నాకు బతకాలని లేదు. ఇందులో నా కుటుంబ సభ్యులది ఎలాంటి తప్పూ లేదు. తమ్ముడూ.. తల్లిదండ్రులను, నా భార్యా పిల్లలను బాగా చూసుకో’’.. అంటూ వీడియో తీసుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సుమారు 15ఏళ్లుగా తాము దుకాణం నిర్వహిస్తున్నామని, ఉన్నట్టుండి దుకాణాలను ఎత్తేయడం దారుణమని వాపోయారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..

Updated Date - 2023-01-07T18:36:01+05:30 IST