Viral Video: పెద్ద ఎద్దుతో కారులో వెళ్తున్న వ్యక్తి.. అనుమానం వచ్చి ఆపిన పోలీసులు.. అసలు విషయం తెలిసి హర్షం..!
ABN , First Publish Date - 2023-09-01T12:42:45+05:30 IST
ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్ బాగా వైరల్ అవుతోంది. ఒక పెద్ద ఎద్దును ఓ వ్యక్తి ఒక చిన్న కారులో వేసుకొని వెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు.
Viral Video: ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్ బాగా వైరల్ అవుతోంది. ఒక పెద్ద ఎద్దును ఓ వ్యక్తి ఒక చిన్న కారులో వేసుకొని వెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు. ఇక అది చూసిన పోలీసులు అతని కారును ఆపి వాకాబు చేయడం వీడియోలో ఉంది. యూఎస్‌లోని నెబ్రాస్కాలో (Nebraska) ఒక వ్యక్తి ఇలా తన కారు ప్యాసింజర్ సీట్లో ఎద్దును ఎక్కించాడు. అలా ఎద్దును కారులో ఎక్కించుకుని రోడ్డు మీద వెళ్తున్న ఆ వ్యక్తి పేరు లీ మేయర్ (Lee Meyer). అతడు అలా ఎద్దును కారులో ఎక్కించుకుని తీసుకెళ్లడం చూసిన పోలీసులు అతని కారును వెంటనే ఆపారు.
అంత పెద్ద ఎద్దును ఇంత చిన్న కారులో తీసుకెళ్తువేంటి అని ప్రశ్నించారు. అయితే, లీ ఇంతకు ముందు పరేడ్‌లలో హౌడీ డూడీ (Howdy Doody) అని పిలువబడే ఆ ఎద్దును వాహనంలో తిప్పాడు. దాని కోసం కారును ప్రత్యేకంగా మాడీఫై చేయించాడు. కానీ, దానిని కారులో పబ్లిక్ రోడ్లపై తిప్పడం ఇదే మొదటిసారి. దాంతో లీని నార్ఫోక్ పోలీస్ కెప్టెన్ చాడ్ రీమాన్.. ట్రాఫిక్ ఉల్లంఘనల విషయమై వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. కారులో దూసుకెళ్తున్న ఎద్దును చూసి తాము ఆశ్చర్యపోయామని పోలీస్ అధికారి తెలిపారు. అయితే, హౌడీ డూడీని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు.
ఇక హౌడీ డూడీ అనేది వాటుసి జాతికి చెందిన ఎద్దు. వాటుసి ఎద్దులు ఒక రకమైన ఆఫ్రికన్ పశువులు. ఇవి చాలా పెద్ద కొమ్ములను కలిగి ఉండి, గంభీరంగా కనిపిస్తాయి. ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో లీ భార్య రోండా మాట్లాడుతూ ఆ ఎద్దును తమ కుటుంబంలో ఒకటిగా తాము భావిస్తామని తెలిపారు. హౌడీ డూడీ కోసం తన భర్త గత కొన్నేళ్లుగా బాగా వెచ్చిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
Viral News: పాత గోడను రూ.41 లక్షలకు అమ్మకానికి పెట్టిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!