Viral Video: పాపం.. ఈ అమ్మాయి.. కోతే కదా భయపడిపోతుందిలే అనుకుంటే.. ఇలా షాకిస్తుందని అస్సలు ఊహంచలేదు..!

ABN , First Publish Date - 2023-07-17T17:17:49+05:30 IST

కొంత మంది వ్యక్తులు మూగ జీవాలతో దురుసుగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా కటకటాల వెనుక బంధించి ఉన్న జంతువులతో తమకు నచ్చినట్టు ప్రవర్తిస్తారు. వాటిని హింసించేందుకు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన ఓ బాలికకు ఓ కోతి తగిన బుద్ధి చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: పాపం.. ఈ అమ్మాయి.. కోతే కదా భయపడిపోతుందిలే అనుకుంటే.. ఇలా షాకిస్తుందని అస్సలు ఊహంచలేదు..!

కొంత మంది వ్యక్తులు మూగ జీవాల (Animals)తో దురుసుగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా కటకటాల వెనుక బంధించి ఉన్న జంతువులతో తమకు నచ్చినట్టు ప్రవర్తిస్తారు. వాటిని హింసించేందుకు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన ఓ బాలికకు ఓ కోతి (Monkey) తగిన బుద్ధి చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కోతికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. americanbully0 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Monkey Videos).

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బాలిక జూ (Zoo)ను సందర్శించేందుకు వెళ్లింది. అక్కడ ఉన్న జంతువుల ఫొటోలను తీస్తోంది. కోతులు ఉన్న బోను దగ్గరకు వెళ్లి వాటి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించింది. బోను అవతల ఉన్న కోతిని దగ్గరకు వెళ్లి కొట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఓ కోతి తన రెండు చేతులను కటకటాల లోపలి నుంచి బయటకు పెట్టి ఆ అమ్మాయి జట్టు పట్టుకుని లాగేసింది. ఆ అమ్మాయి విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఆ కోతి వదల్లేదు (Monkey teaches a lessong to girl).

Viral: తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక.. నడి సముద్రంలో 60 రోజుల పాటు నరకం.. ఎలా బయటపడ్డారంటే..

ఆ అమ్మాయి కేకేలు వేసినా కోతి మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో పక్కనే ఉన్న వారు అక్కడకు వెళ్లి కోతిని బయపెట్టి ఆ అమ్మాయిని కాపాడారు. ఆ ఘటనను రికార్డు చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఆ వీడియోకు వేల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``తగిన గుణపాఠం చెప్పింది``, ``ఇక, ఆ అమ్మాయి ఏ జంతువు జోలికీ వెళ్లదు``, ``ఇన్‌స్టంట్ ఖర్మ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-07-17T17:17:49+05:30 IST