Viral Video: ఇంట్లో పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న అత్తాకోడళ్లు, ఆ సమయంలో కొడుకు ఏం చేశాడో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం!

ABN , First Publish Date - 2023-07-28T20:02:04+05:30 IST

అత్తాకోడళ్ల మధ్య గొడవలనేవి సర్వ సాధారణం. చాలా చిన్న విషయానికి కూడా ఇద్దరూ గొడవపడుతుంటారు. అవి ఎప్పటికీ తెగని పంచాయితీలు. అత్తాకోడళ్ల గొడవలో సాధారణంగా మగవాడు నలిగిపోతాడు. అటు తల్లిని సముదాయించలేక, ఇటు భార్యకు సర్దిచెప్పలేక సతమతమవుతుంటాడు.

Viral Video: ఇంట్లో పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న అత్తాకోడళ్లు, ఆ సమయంలో కొడుకు ఏం చేశాడో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం!

అత్తాకోడళ్ల మధ్య గొడవలనేవి సర్వ సాధారణం. చాలా చిన్న విషయానికి కూడా ఇద్దరూ గొడవపడుతుంటారు. అవి ఎప్పటికీ తెగని పంచాయితీలు. అత్తాకోడళ్ల గొడవలో సాధారణంగా మగవాడు నలిగిపోతాడు. అటు తల్లిని సముదాయించలేక, ఇటు భార్యకు సర్దిచెప్పలేక సతమతమవుతుంటాడు. అందుకే చాలా మంది అత్తాకోడళ్ల గొడవలోకి వెళ్లే సాహసం చేయరు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో అత్తాకోడళ్లు ఇద్దరూ భీకరంగా కొట్టుకున్నారు (Woman and daughter-in-law get into ugly fight).

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అలీగఢ్‌కు చెందిన అరవింద్ కుమార్‌కు కొన్నేళ్ల కిందట ప్రీతి దేవి అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అరవింద్ కుటుంబం, అతడి తల్లిదండ్రులు ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. దీంతో ప్రీతి దేవి, ఆమె అత్త రాణితో తరచుగా గొడవ పడేది. గతంలో అత్తను ఆమె కొట్టింది. తాజాగా కోడలి (Daughter-in-law)పై అత్త దాడి చేసింది. కోడిలిని కాలితో తన్నడం, ఆమె తలను నేలకేసి కొట్టడం వంటి పనులు చేసింది. కోడలు అత్త (Mother-in-law)ను ఆపేందుకు ప్రయత్నించింది. ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించింది.

Viral Video: అమ్మ బాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇదేం రచ్చ.. ఈ కుర్రాడితో కండక్టర్ ఫైటింగ్ వెనుక..!

అత్తాకోడళ్లు గొడవ పడుతుంటే అక్కడే ఉన్న అరవింద్ కుమార్ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా వారిద్దరూ కొట్టుకుంటే ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. అంతేకాదు ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మగపిల్లాడని కనలేదని అత్త తనను కొడుతోందని కొడలు చెబుతోంది. ఉన్న ఒక్క ఇంటిని తమ పేరుపై రాయాలని కోడలు కొడుతోందని అత్త చెబుతోంది.

Updated Date - 2023-07-28T20:02:04+05:30 IST