MS Dhoni: రాంచీ ఎలా వెళ్లాలి? హఠాత్తుగా ధోనీని చూసి షాకైన అభిమానులు.. మహీ సింప్లిసిటీకి ఫిదా!
ABN , First Publish Date - 2023-08-12T10:29:14+05:30 IST
దేశవ్యాప్తంగా వీరాభిమానులను కలిగి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం తన విరామ సమయాన్ని తన స్వంత ఊరు రాంచీలో గడపుతున్నాడు. చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతున్నాడు. వింటేజ్ కార్లు, బైక్‌లపై తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
దేశవ్యాప్తంగా వీరాభిమానులను కలిగి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం తన విరామ సమయాన్ని తన స్వంత ఊరు రాంచీ (Ranchi)లో గడపుతున్నాడు. చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతున్నాడు. వింటేజ్ కార్లు, బైక్‌లపై తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అతడు ఎక్కడకు వెళ్లినా అభిమానులు (Dhoni Fans) ఫాలో అవుతున్నారు. అయినా ధోనీ ఇబ్బంది పడకుండా వారితో సరదాగా మాట్లాడుతున్నాడు.
తాజాగా ధోనీ తన మిత్రుడితో కలిసి కారులో షికారుకు బయల్దేరాడు. అయితే తిరిగి వచ్చేటపుడు అతడికి దారి తెలియలేదు. దాంతో మార్గమధ్యంలో ఉన్న వారి సహాయం తీసుకున్నాడు. రాంచీకి ఎలా వెళ్లాలో అడిగి తెలుసుకున్నాడు. హఠాత్తుగా ధోనీ ప్రత్యక్షమయ్యే సరికి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాంచీకి ఎలా వెళ్లాలో చెప్పారు (Dhoni Asking Directions to Ranchi). బైక్‌ల మీద ఫాలో అవుతూ దారి చూపించారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
How To Create Wealth: జీతమే సరిపోవడం లేదు.. ఇక సేవింగ్స్ ఎక్కడ..? అని వాపోతున్నారా..? ఈ 7 సూత్రాలను పాటిస్తే..!
వైరల్ అవుతున్న ఆ వీడియోలో (Viral Video) ధోనీ ఫ్రెండ్ కారు డ్రైవింగ్ చేస్తుండగా, ధోనీ పక్క సీట్లో కూర్చున్నాడు. ముందు ఓ సర్కిల్ వస్తుందని, అక్కడ నుంచి వెళ్తే రాంచీకి చేరుకుంటారని ఓ అభిమాని చెప్పాడు. ``ఆ విగ్రహం ఉన్న సర్కిల్ వద్ద రౌండ్ తీసుకోవాలా అని ధోనీ`` ఆ అభిమానిని అడిగాడు. బయల్దేరే ముందు అభిమానులతో కలిసి సెల్ఫీ దిగాడు. వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ధోనీ సింప్లిసిటీకి అభిమానులు మురిసిపోతున్నారు.