Share News

Mysterious Disease: అమెరికాలో మరో వింత రోగం.. ఉన్నట్టుండి అనారోగ్యం పాలవుతున్న శునకాలు..!

ABN , First Publish Date - 2023-11-22T16:01:36+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు శునకాలకు సోకుతున్న వింత వ్యాధి ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

Mysterious Disease: అమెరికాలో మరో వింత రోగం.. ఉన్నట్టుండి అనారోగ్యం పాలవుతున్న శునకాలు..!

జబ్బు చేసింది అనగానే వైద్యుడిని సంప్రదిస్తే సరిపోతుందిలే అనుకునేవారు అంతా. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిన్న చిన్న అనారోగ్యాలు కలిగినా సరే ప్రజలు భయపడుతున్నారు. కరోనా తరువాత నుండి వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తత పెరిగింది. నలతగా ఉందంటే ఎవరైనా నోరు తెరిచి తమ కుటుంబ సభ్యులకు చెప్పి చికిత్స పొందుతారు కానీ నోరులేని మూగజీవులు అలా కాదు అవి చాలా సమస్యలు మౌనంగా భరిస్తాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు శునకాలకు సోకుతున్న వింత వ్యాధి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అసలు ఆ జబ్బు ఏంటనే విషయం మీద స్పష్టత లేకపోవడం ఈ భయాన్ని మరింత పెంచుతోంది. వ్యాధులు దేశాల నుండి మరికొన్ని దేశాలకు కూడా వ్యాపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త వ్యాధి లక్షణాలు, శునకాల యజమానులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

అమెరికా(America)లోని శునకాలలో ఓ వింత వ్యాధి(strange disease in dogs) వ్యాప్తి అవుతోంది. ఈ వ్యాధి సోకిన శునకాలలో పొడి దగ్గు ఉంటుంది. అవి దగ్గేటప్పుడు హార్న్ సౌండ్ వెలువడుతుంది. కొన్నిసార్లు ఈ దగ్గు కారణంగా వాంతులు కూడా సంభవిస్తాయి. కళ్లు,ముక్కు నుండి నీరు కారడం. అన్ని సమయాల్లో శునకాలు నీరసంగా ఉండటం. ఆకలి లేకపోవడం, శ్వాస తీసుకునేటప్పుడు గురక పెట్టడం వంటి లక్షణాలు శునకాలలో ఉన్నాయి. శునకాలలో శ్వాస సంబంధ సమస్యలు శరవేగంగా పెరుగుతాయి. కేవలం 24 నుండి 36 గంటలలోనే శునకాల ఆరోగ్యం చాలా క్షీణిస్తోంది. ఇవన్నీ శునకాల యజమానులను, పశువైద్యులను కలవపెడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Health Facts: కూర్చునే కుర్చీ వల్ల కూడా రోగాలే.. అసలు ఓ మంచి కుర్చీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే..!



వ్యాధులు దేశం నుండి మరొక దేశానికి వ్యాపిస్తుంటాయి. కాబ్టటి శునకాల యజమానులు తమ శునకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పశువైద్యులు హెచ్చరిస్తున్నారు. శునకాలకు సోకుతున్న ఈ వింత వ్యాధి గురించి స్పష్టత లేకపోవడం వల్ల దీని చికిత్స గురించి కూడా స్పష్టత లేదు. ఈ కారణంగా శునకాలు దగ్గినా, తుమ్మినా, నీరసంగా ఉన్నట్టు అనిపించినా, కళ్లు ముక్కు నుండి నీరు కారుతున్నా వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

శునకాలకు ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శునకాలను వీలైనంతగా బయటి ప్రదేశాలకు తీసుకెళ్లకుండా ఉండటం ఉత్తమం. పార్కులకు, శునకాల కోసం స్పెషల్ గా అందించే సేవల కోసం తీసుకెళ్లడం కొన్ని రోజులు ఆపాలి. అలాగే శునకాలకు శ్వాసకోశ సంబంధ సమస్యలకు సంబంధించిన టీకాలు వేయించడం మర్చిపోకూడదు.

ఇది కూడా చదవండి: Kidney Damage Signs: మూత్రంలో ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. కిడ్నీలు పాడయిపోతున్నట్టే లెక్క..!


Updated Date - 2023-11-22T16:06:19+05:30 IST