Viral Video: ఏం క్రియేటివిటీ బాసూ.. ఊరు మొత్తానికి సూపర్ వాష్ బేషిన్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి!

ABN , First Publish Date - 2023-08-11T10:16:42+05:30 IST

చాలా కష్టసాధ్యమైన విషయాలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. సాధారణ ప్రజలు కూడా అవసరం వస్తే తమలోని ఇంజినీరింగ్ ప్రతిభను బయటపెడతారు. ఇప్పటికే అలాంటి ఎన్నో ఆలోచనలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి.

Viral Video: ఏం క్రియేటివిటీ బాసూ.. ఊరు మొత్తానికి సూపర్ వాష్ బేషిన్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి!

చాలా కష్టసాధ్యమైన విషయాలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. సాధారణ ప్రజలు కూడా అవసరం వస్తే తమలోని ఇంజినీరింగ్ ప్రతిభను బయటపెడతారు. ఇప్పటికే అలాంటి ఎన్నో ఆలోచనలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుని వైరల్‌ (Viral Videos)గా మారాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో నాగాలాండ్ (Nagaland) మంత్రినే ఆకట్టుకుంది. ఆయన ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు (Jugaad Videos).

నాగాలాండ్ ఉన్నత విద్య, పర్యాటక శాఖ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా (Nagaland Minister Temjen Imna ) అలోంగ్ ఇటీవల ఒక వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో వెదురుతో రూపొందించిన వెరైటీ వాష్ బేషిన్ ఉంది (Natural Washbasin). ఆ వాష్ బేషిన్‌ను ఒకరిద్దరు కాదు ఏకంగా ఊరు ఊరంతా ఉపయోగిస్తున్నారు. ముందుగా వెదురు గొట్టాలను అమర్చి దానిలో నీటిని ప్రవహింప చేశారు (Bamboo Washbasin). ఆ వెదురు గొట్టాలకు వరుసగా రంధ్రాలు చేసి స్టాపర్లను అమర్చారు. ప్రతి స్టాపర్ దగ్గరా సబ్బు, టవల్‌ను కూడా అమర్చారు.

Snake Bite: పాము కరిచిన వెంటనే అంతా తెలియక చేస్తున్న పెద్ద పొరపాటు ఇదే.. ప్రాణాలే పోతున్నాయ్..!

ఆ గ్రామస్థుల పనితనం నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ``మీరు ఇలాంటిది ఎప్పుడైనా చూశారా?`` అంటూ ఆయన ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఆ వీడియోను దాదాపు 2 లక్షల మంది వీక్షించారు. 10 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ గ్రామస్థుల క్రియేటివిటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-08-11T10:20:16+05:30 IST