Neeraj Chopra: జాతీయ జెండాను విసిరిన ప్రేక్షకుడు.. కింద పడిపోతుందేమోనని నీరజ్ చోప్రా చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా..!

ABN , First Publish Date - 2023-10-05T13:36:00+05:30 IST

భారతదేశానికి బంగారు పతకాన్ని అందించిన నీరజ్ చోప్రా అదే రోజున మరొక సంఘటన ద్వారా దేశ ప్రజల మనసు దోచేశాడు.

Neeraj Chopra: జాతీయ జెండాను విసిరిన ప్రేక్షకుడు.. కింద పడిపోతుందేమోనని నీరజ్ చోప్రా చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా..!

ఆసియా గేమ్స్ లో భారతదేశం తన సత్తా చాటుతోంది. ఈ గేమ్స్ లో నీరజ్ చోప్రా ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఎప్పటిలానే తన అత్యత్తమ ప్రదర్శనతో బంగారు పతకాన్ని భారతదేశానికి అందించాడు. బంగారు పతకం సాదించిన తరువాత భారతీయ ప్రేక్షకుల దగ్గరకు వెళ్లిన నీరజ్ చోప్రా పై ఓ అభినాని జాతీయ జెండాను విసరగా అది దిశ తప్పి కింద పడిపోసాగింది. ఈ క్రమంలో నీరజ్ చోప్రా చేసిన ఫీట్ నెటిజన్ల మనసు దోచేసింది. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

భారతదేశ జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా(javelin throw athlet Neeraj Chopra). ఇతను ప్రపంచంలోనే జావెలిన్ త్రో విభాగంలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఆసియా గేమ్స్ లో భాగంగా ఇతను జావెలిన్ త్రోలో పాల్గొని బంగారు పతకం(Asian games javelin throw gold medal winner) సాధించాడు. దీంతో అతని ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నవారు సంతోషంలో మునిగిపోయారు. బంగారు పతకం గెలిచిన అనంతరం తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకునేందుకు నీరజ్ చోప్రా వారి ముందుకు వెళ్లాడు. వారికి అభివాదం చేస్తుండగా ఓ అభిమాని తన చేతిలోని జాతీయ పతాకాన్ని(Indian flag) నీరజ్ చోప్రా మీదకు విసిరాడు. అయితే ఆ జాతీయ పతాకం దిశ తప్పి కింద పడిపోసాగింది. ఈ విషయం పసిగట్టిన నీరజ్ చోప్రా తను కింద పడిపోయినా పర్వాలేదు కానీ దేశ పతాకం కింద పడిపోకూడదని చురుగ్గా ముందుకు కదిలి జాతీయ పతాకాన్ని ఒడిసిపట్టాడు(Neeraj Chopra catch Indian flag). ఆ తరువాత అభిమానులకు సంతోషంగా అభివాదం చేస్తూ అక్కడి నుండి ముందుకు కదిలాడు. ఇది పెద్ద రిస్కీ ఫీట్ కాకపోయినా దేశ పతాకం మీద అతనికి ఉన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Python vs Cat: గూట్లో దాక్కున్న పిల్లి పిల్లలు.. తినేందుకు వెతుక్కుంటూ వచ్చిన కొండ చిలువతో తల్లి పిల్లి బిగ్ ఫైట్..!


అక్టోబర్ 4వ తేదీన ఈ వీడియోను @sagarcasm అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) యూజర్ షేర్ చేశాడు. 'అతనికి బంగారు రంగంటే చాలా ఇష్టం, కానీ దానికి మించి ఈ మూడురంగులంటే ఇంకా ఇష్టం' అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'బంగారు బిడ్డ' అంటూ బంగారు పతకాలతో దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాడని ఒకరు కామెంట్ చేశారు. 'భారతదేశం నిన్ను చూసి గర్వపడుతోంది' అని మరొకరు కామెంట్ చేశారు.

Viral Video: ఈ రిపోర్టర్ చెప్పే న్యూస్.. ఆ చిలుకకు కూడా నచ్చలేదేమో.. సైలెంట్‌గా వచ్చి ఇయర్ బడ్స్‌ను ఎత్తుకెళ్లిపోయిందిగా..!


Updated Date - 2023-10-05T13:36:00+05:30 IST