Viral Video: ప్లాస్టిక్ డబ్బాలో పటాకులు పేల్చిన యువకులు.. ఇందులో వింతేముందీ అంటారా.. అది ఎలా పేలిందంటే..
ABN , First Publish Date - 2023-02-23T21:35:06+05:30 IST
కొందరు తొందరపాటు, ఏమరపాటులో చేసే పనులు కొన్ని ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఏదో చేయబోయి.. ఇంకేదో చేస్తుంటారు. చివరకు అయ్యో! ఇలా చేశానేంటీ.. అని నాలుక కరుచుకుంటూ ఉంటారు. ఇలాంటి పనుల్లో కొన్ని బాధను కలిగిస్తే.. మరికొన్ని..
కొందరు తొందరపాటు, ఏమరపాటులో చేసే పనులు కొన్ని ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఏదో చేయబోయి.. ఇంకేదో చేస్తుంటారు. చివరకు అయ్యో! ఇలా చేశానేంటీ.. అని నాలుక కరుచుకుంటూ ఉంటారు. ఇలాంటి పనుల్లో కొన్ని బాధను కలిగిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది. ఇద్దరు యువకులు.. పటాకులను ప్లాస్టిక్ డబ్బాలో వేసి కాల్చారు. అయితే చివరకు పటాకు ఎలా పేలిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఇద్దరు యవకులు పటాకులు (firecrackers) కాల్చడంలో నిమగ్నమై ఉంటారు. అయితే ఏదైనా వెరైటీగా కాల్చాలని అనుకున్నారో ఏమో గానీ.. ఓ ప్లాస్టిక్ డబ్బాను (plastic container) తీసుకొస్తారు. అందులో వేసి కాల్చితే పెద్ద శబ్ధం వస్తుందని వారి ప్లాన్. అందుకు తగ్గట్టుగానే డబ్బాను సిద్ధం చేసుకుని పటాకును కూడా వెలిగిస్తారు. అయితే ఇక్కడే వారు పప్పులో కాలేస్తారు. వెలిగించిన పటాకును డబ్బాలో వేయకుండా.. వెలిగించిన లైటర్‌ను వేస్తారు.
వెలుగుతున్న పటాకును పట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీస్తారు. డబ్బా వద్దే ఓ మొబైల్‌ని పెట్టి రికార్డు ఆన్‌లో పెట్టి ఉంటారు. వారు అక్కడి నుంచి పరుగులు పెట్టిన కాసేపటికే చేతిలోని పటాకు ఫట్‌మని (Fireworks burst) పేలుతుంది. అక్కడ జరిగిన పేలుడుకు సింబాలిక్‌గా వీడియో సడన్‌గా బ్లాంక్ అయిపోతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఏదో అనుకుంటే... ఇంకేదో అయ్యిందే.. అని కొందరు, ఇలాంటి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ మరికొందరు సలహా ఇస్తున్నారు.