Nikhil Kamath: ఒకప్పుడు రూ.8 వేల జీతం.. నేడు 9 వేల కోట్లకు అధిపతి.. 35 ఏళ్ల వయసుకే ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడంటే..!
ABN , First Publish Date - 2023-04-07T16:00:24+05:30 IST
ఇదేమీ సినిమా కాదండీ.. వంద రూపాయతో హీరో కోటీశ్వరుడు అయినట్టు కథలు అల్లి చెప్పడానికి.
నెలకు 8వేల రూపాయల జీతం(8Thousand rupees) సంపాదించే వ్యక్తి ఏకంగా 9వేల కోట్లకు(9Thousand crores rupees) అధిపతి అయ్యాడంటే నమ్మగలరా? ఇదేమీ సినిమా కాదండీ.. వంద రూపాయతో హీరో కోటీశ్వరుడు అయినట్టు కథలు అల్లి చెప్పడానికి. ఇది ఓ వ్యక్తి జీవితం.. నిఖిల్ కామత్(Nikhil kamath) జీవితం. ఫోర్భ్స్ 2023సంవత్సరానికి గానూ విడుదల చేసిన బిలీయనర్ల (Forbes 2023 billionaire list) జాబితాలో యంగెస్ట్ ఇండియన్ బిలీయనీర్(Youngest indian billionaire) గా మెరిసిన నిఖిల్ కామత్ 8వేల రూపాయల సంపాదనతో 9వేల కోట్ల అధిపతి ఎలా అయ్యాడో తెలుసుకుంటే..
డబ్బు సంపాదించడం(Money earning) ఒక కళ. చాలామందికి ఈ కళ ఉంటుంది కానీ దాన్ని నిలబెట్టుకునే నేర్పు, దాన్ని మరింత అభివృద్ది చేసుకునే తెలివితేటలు అస్సలు ఉండవు. నిఖిల్ కామత్ తన 17సంవత్సరాల వయసులో(17 years old) మొట్టమొదటిసారిగా కాల్ సెంటర్ లో ఉద్యోగానికి(Call center job) చేరాడు. అక్కడ అతని వేతనం 8వేల రూపాయలు. ఈ క్రమంలో అతను స్టాక్ మార్కెట్(Stock market) లో పెట్టుబడి పెట్టేవాడు. తనకొచ్చే 8వేల సంపాదనలో కొంత మొత్తం దీనికి వెచ్చించేవాడు. అయితే ఆ సమయంలో అతనికి షేర్ మార్కెట్ గురించి అంత అవగాహన(understanding) దాని పట్ల ఆసక్తి(interest) ఉండేదికాదు. కానీ సంవత్సరం తరువాత అతను పెట్టిన పెట్టుబడి విలువ ఊహించని విధంగా పెరిగింది. స్టాక్ మార్కెట్ వల్ల ఇంత మొత్తంలో లాభాలు వస్తాయా అని అతను ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో తన కొడుకు స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు రాబడతాడనే నమ్మకంతో నిఖిల్ తండ్రి తను పొదుపు చేసుకున్న డబ్బులో నుండి కొంత మొత్తం నిఖిల్ కు ఇచ్చాడు. స్టాక్ మార్కెట్ లో పెట్టమన్నాడు. ఇదే నిఖిల్ పెద్దమొత్తంలో పెట్టిన మొదటి పెట్టుబడి. స్టాక్ మార్కెట్ గురించి పూర్తీగా అన్ని విషయాలు తెలుసుకున్న తరువాత తను ఉద్యోగం చెయ్యడం మానేశాడు. ఆ తరువాత అతని జీవితం కొత్త మలుపు తిరిగింది.
ఉద్యోగం మానేసిన తరువాత నిఖిల్ అన్నయ్య నితిన్ తో కలసి కామత్ అసోసియేషన్స్(kamath association) ప్రారంభించాడు. దీని నుండి వారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిర్వహించేవారు. ఇదయ్యాక ఈ అన్నదమ్ములు ఇద్దరూ 2010లో జీరోధా(Zerodha) స్టాక్ బ్రోకేజీ సంస్థను స్థాపించారు. ఆరోజు నుండి ఈరోజు వరకు ఈ అన్నదమ్ములు ఇద్దరూ వెనుదిరిగిచూడలేదు. స్టాక్ మార్కెట్ మీద వీరికి ఉన్న అవగాహన వీరిని వేలకోట్లకు అధిపతులను చేశాయి. 18ఏళ్ళలో 8వేల రూపాయల నుండి 9వేల కోట్ల వరకు ప్రయాణించాడు. అయితే ఇంత సంపాదించినా వీరు సాధారణంగానే జీవిస్తున్నారు. రోజూ 85శాతం పనిచేస్తుంటారు. 'నా దగ్గరున్న డబ్బు నా చెయ్యి జారిపోతే అప్పుడు జీవితం భయం అనిపిస్తుంది కదా అందుకే పనిచేస్తుండాలి కష్టపడేవాడు తిరిగి సంపాదించుకోగలడు' అని అంటున్నాడు నిఖిల్.