Husband: బిగ్గరగా ఏడ్చిన పాప.. వెంటనే గదిలోకి వెళ్లి ఏమైందని భర్తను నిలదీసిన భార్య.. ఎంతకూ ఏడుపు ఆపకపోవడంతో ఆస్పత్రికి వెళ్తే..
ABN , First Publish Date - 2023-05-31T17:32:31+05:30 IST
అనుమానం పెనుభూతంలాంటిది. మనసులో అనుమానం పుడితే రాక్షసుల్లా మారిపోతారు. అంతటితో ఆగకుండా ఎంతటి ఘోరానికైనా తెగిస్తారు. ఇందుకు ఉదాహరణే
అనుమానం పెనుభూతంలాంటిది. మనసులో అనుమానం పుడితే రాక్షసుల్లా మారిపోతారు. అంతటితో ఆగకుండా ఎంతటి ఘోరానికైనా తెగిస్తారు. ఇందుకు ఉదాహరణే తాజాగా ఒడిషాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఉదంతం.
ఏడాది క్రితమే వారిద్దరికీ పెళ్లైంది. భార్య గర్భవతి అయింది. డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వెళ్లింది. డాక్టర్లు చెప్పినట్టుగానే ఆమెకు డెలివరీ జరిగింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తల్లి ఎంతగానో సంతోషించింది. కానీ భర్తలో మాత్రం ఆనందం లేదు. అనుమానంతో రగిలిపోతున్నాడు. అంతే భార్య, బిడ్డను చూసేందుకు అత్తగారింటికి వచ్చి ఘాతుకానికి తెగబడ్డాడు. బిడ్డ తనకు పుట్టలేదని.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ శిశువుకు సిరంజి ద్వారా పరుగుల మందు ఎక్కించి చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతలో చంటి బిడ్డ ఏడ్పు విని తల్లి వచ్చి చూడక ఈ దారుణం వెలుగు చూసింది.
చందన్ అనే యువకుడికి (odisha father).. తన్మయి అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి మే 9న ఆడపిల్ల పుట్టింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం (wife extramarital affair) పెట్టుకున్నందువల్లే గర్భం దాల్చిందన్న అనుమానంతో చందన్ రగిలిపోయాడు. ప్రసవమైన రెండు వారాలకు స్థానిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తన్మయి పుట్టింటికి చేరుకుంది.
భార్యాబిడ్డలను చూసే నెపంతో చందన్ సోమవారం అత్తగారింటికి వచ్చాడు. భార్య మరో గదిలో ఉన్న సమయంలో చిన్నారి శరీరంలోకి (newborn baby) సిరంజి ద్వారా పురుగుల మందు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. దీంతో శిశువు ఒక్కసారిగా ఏడ్వడం మొదలు పెట్టింది. ఏడుపు విని తన్మయి భర్తను నిలదీయగా బుకాయించాడు. వెంటనే పాపను బాలేశ్వర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సాగరిక నాథ్ తెలిపారు.