RRR: పాకిస్తాన్‌కు పాకిన ‘నాటు నాటు’ ఫీవర్.. అదిరిపోయే స్టెప్పులేసిన పాక్ నటి..

ABN , First Publish Date - 2023-02-25T12:44:29+05:30 IST

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వరల్డ్‌వైడ్‌గా సంచలన విజయం సాధించిన తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.

RRR: పాకిస్తాన్‌కు పాకిన ‘నాటు నాటు’ ఫీవర్.. అదిరిపోయే స్టెప్పులేసిన పాక్ నటి..

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వరల్డ్‌వైడ్‌గా సంచలన విజయం సాధించిన తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్‌కు విదేశీయులు కూడా మెస్మరైజ్ అయ్యారు. తాజాగా ఈ ఫీవర్ పాకిస్తాన్‌కు కూడా పాకింది. పాక్ నటి ఒకరు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాకిస్తానీ నటి హనియా ఆమిర్‌ (Hania Aamir) ఓ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలోనే ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ కు స్టెప్పులేశారు. ‘నాటు నాటు’ సాంగ్ హిందీ వెర్షన్ ‘నాచో నాచో’ కు హుక్ డ్యాన్స్ చేసి ఫంక్షన్‌కు వచ్చిన అతిథులను మెస్మరైజ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులందరు విపరీతంగా షేర్ చేస్తున్నారు. హనియా అద్భుతమైన ఎనర్జీతో డ్యాన్స్ చేసిందని కామెంట్ చేస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఆస్కార్ నామినేషన్‌ను కూడా ఈ మూవీ సాధించింది. ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ రేసులో నిల్చింది. ఆస్కార్ అవార్డ్స్‌ను మార్చి రెండో వారంలో ప్రదానం చేయనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Simbu: ఎట్టకేలకు శింబు పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-25T12:53:32+05:30 IST