Pani Puri: పానీ పూరీ తినే అలవాటుందా..? ఒక్కసారి ఇది చూడండంటూ నెట్టింట వైరల్గా మారిన వీడియో..!
ABN , First Publish Date - 2023-07-06T16:00:28+05:30 IST
ఈ పానీ పూరీని మీరు ఇదివరకు ఎప్పడూ తిని ఉండరు. అసలు చూసుండరు కూడా..
పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ పానీపూరీ అంటే మహా ఇష్టం. నార్మల్ పానీ పూరీలో కేలరీలు కూడా పెద్దగా ఉండవు. బరువు పెరుగుతామేమో అనే బెంగ పెట్టుకోకుండా అందరూ తినేస్తుంటారు. అయితే ఇప్పుడు విభిన్నమైన పానీ పూరీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బహుశా ఈ పానీ పూరీని మీరు ఇదివరకు ఎప్పడూ తిని ఉండరు. అసలు చూసుండరు కూడా.. ఈ పానీ పూరీ తినడం వల్ల బోలెడు ప్రోటీన్ ఒంట్లోకి చేరుతుందట. అటు ఆరోగ్యం, ఇటు శక్తి రెండూ ఈ పానీపూరీ ద్వారా సొంతమవుతాయని అంటున్నారు. దీనిక సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం దీన్ని చూసి కళ్ళు తేలేస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
పానీ పూరీ(pani puri) భారతీయులకు ఎంతో ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. విదేశీయులు సైతం మన పానీ పూరీని ఇష్టపడుతున్నారంటే ఇందులో ఎంత కిక్కుందో అర్థం చేసుకోవచ్చు. పానీపూరీ ఎన్నో ఫ్లేవర్లలో లభ్యమవుతుంది. కానీ ఎగ్ పానీ పూరీ(Egg pani puri) ఎప్పుడైనా ట్రై చేశారా? కనీసం ఎగ్ పానీ పూరీ గురించి విన్నారా? వీడియోలో ఓ పానీ పూరీ సెల్లర్ ఎగ్ పానీ పూరీని తయారుచేయడం(Egg pani puri making) చూడచ్చు. ఇతనేదో మైదాతో చేసిన పూరీలలో ఎగ్ స్టఫ్ పెడతాడు అనుకుంటే పొరపాటే. ఇతను ఉడికించిన కోడిగుడ్లను రెండు సమాన భాగాలుగా కట్ చేసి మధ్యలో ఉన్న పచ్చసొనను తీసేశాడు. ఇప్పుడు రెండు భాగాలుగా ఉన్న గుడ్డు ముక్కల్లో గుంట ఏర్పడుతుంది. ఈ గుంట భాగంలో టమాటా కెచప్(tomato ketchup), క్రీమ్ వేశాడు(cream). ఈ గుడ్డు ముక్కలను ఛీత్ తురుముతో(cover with grated cheese) నింపేశాడు. దీనిమీద ఛాట్ మసాలా చల్లి, కొత్తిమీరతో గార్నిష్ చేశాడు. అంతే ఎగ్ పానీ పూరీ రెడీ.
Wife: భర్త పుట్టినరోజుకు సర్ఫైజ్ గా విష్ చెయ్యాలని భార్య ప్లాన్.. చెప్పకుండా టౌన్ లో ఉన్న అతని గదికి పిల్లలతో సహా వెళితే..
ఈ వీడియోను surti_lalo అనే ఇన్స్టాగ్రామ్ పేజీ(Instagram page) నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ ఎగ్ పానీ పూరీ మీద ఒకటే సెటైర్లు వేస్తున్నారు. ' పానీ పూరీ తయారీకి వినియోగించే ఒక్క పదార్థం కూడా ఇందులో వాడలేదు. అలాంటప్పుడు దీనికి ఎగ్ పూరీ అనే పేరు ఎందుకు పెట్టారు, ఇది చాలా అసహ్యంగా ఉంది' అని మండిపడుతున్నారు. 'అతను ఎగ్ ఛాట్ తయారు చేసిన తరువాత ఎగ్ పానీ పూరీ తయారుచేస్తాడేమో అని నేను వీడియో పూర్తైనా అలాగే చూస్తుండిపోయాను' అని మరొకరు వ్యంగ్యంగా స్పందించారు. మరికొందరు వీడియో డిస్ లైక్ చేయడానికి డిస్ లైక్ బటన్ వెతకడం మొదలు పెట్టారు.