Papaya Seeds: అమ్మ బాబోయ్.. బొప్పాయి గింజలతో ఇన్ని లాభాలా..? తెలియక ఎన్ని సార్లు పారేసి ఉంటారో..!
ABN , First Publish Date - 2023-08-13T11:19:31+05:30 IST
ఒకప్పుడు పుచ్చకాయ, కర్భూజ విత్తనాలను కూడా ఇలాగే తీసి పడేస్తుండేవారు. కానీ వాటిలో పోషకాల గురించి తెలిశాక చాలామంది వాటిని జాగ్రత్త చేసి తింటూంటారు. ఈ కోవలోకి ఇప్పుడు బొప్పాయి గింజలు కూడా వచ్చిచేరాయి.
పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. సీజన్ తో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. చాలామంది బొప్పాయి పండు తినేటప్పుడు పైన తొక్క తొలగించడమే కాదు లోపల విత్తనాలను కూడా తీసి పారేస్తుంటారు. ఒకప్పుడు పుచ్చకాయ, కర్భూజ విత్తనాలను కూడా ఇలాగే తీసి పడేస్తుండేవారు. కానీ వాటిలో పోషకాల గురించి తెలిశాక చాలామంది వాటిని జాగ్రత్త చేసి తింటూంటారు. ఈ కోవలోకి ఇప్పుడు బొప్పాయి గింజలు కూడా వచ్చిచేరాయి. బొప్పాయి గింజలు(papaya seeds). వీటిని తినడం వల్ల బోలెడు ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయి. బొప్పాయి గింజలను ఏ సమయంలో తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుంటే..
బొప్పాయి గింజల్లో పొపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. భోజనం తరువాత కొద్ది మొత్తంలో బొప్పాయి గింజలను తీసుకోవడం వల్ల తిన్న ఆహారంలో ప్రోటీన్లు విచ్చిన్నం చేస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకం వంటి లక్షణాలు తగ్గిస్తుంది.
ఈ గింజలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో బ్యాక్టీయల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతాయి. ఎండబెట్టిన బొప్పాయి గింజలను పొడి చేసి, ఈ పొడికి కొద్దిగా తేనె జోడించి తీసుకోవచ్చు.
ఎక్కువగా మధ్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నవారికి బొప్పాయి గింజలు బాగా సహాయపడతాయి. బొప్పాయి గింజల్లో ఉండే కొన్ని రసాయనాలు కాలేయాన్ని శుద్దిచేయడంలో సహాయపడతాయి.
బొప్పాయి గింజలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో మంట, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది పనిచేస్తుంది.
బొప్పాయి విత్తనాలలో కార్భైడ్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది కడుపులో నులిపురుగలు తొలగించడంలో సహాయపడుతుంది. తాజా బొప్పాయి విత్తనాలను మెత్తగా నూరి ఆ పేస్ట్ ను పరగడుపున తీసుకుంటే కడుపులో నులిపురుగలు సమస్య తగ్గిపోతుంది.
White hair: ఏ మెడిసిన్స్ అక్కర్లేకుండానే.. కేవలం కొబ్బరి నూనెతోనే తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చొచ్చంటే..!
బొప్పాయి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధికారకాల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఆహారంలో బొప్పాయి గింజలను చేర్చుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
క్యాన్సర్ ను నిరోధించడంలో కూడా బొప్పాయి గింజలు పనిచేస్తాయి. బొప్పాయి గింజలలో ఐసోథియోసైనేట్స్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
గుండె వ్యాధుల ప్రమాధాన్ని తగ్గించడంలో బొప్పాయి గింజలు బాగా పనిచేస్తాయి. బొప్పాయి గింజల్లో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు గొప్ప యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. కొలెస్ఠ్రాల్ తగ్గించడంలోనూ, రక్తపోటును నియంత్రించడంలోనూ బొప్పాయి గింజలు సహాయపడతాయి.
బొప్పాయి గింజలు ఆరోగ్యానికే కాదు, సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇందుకోసం బొప్పాయి గింజల రసం లేదా బొప్పాయి గింజల నూనె ఉపయోగించాలి.