Two Marriages in 3 Days: మూడ్రోజుల్లోనే రెండు పెళ్లిళ్లు.. భార్యకు తెలీకుండా ప్రేయసితో పెళ్లి.. అద్దెంట్లో ఆ భర్త మరో కొత్త కాపురం.. చివరకు..!

ABN , First Publish Date - 2023-04-26T12:23:34+05:30 IST

పెళ్లైన మూడు రోజులకే మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడో ఘనుడు. అది కూడా లవ్ మ్యారేజ్ (Love Marriage).

Two Marriages in 3 Days: మూడ్రోజుల్లోనే రెండు పెళ్లిళ్లు.. భార్యకు తెలీకుండా ప్రేయసితో పెళ్లి.. అద్దెంట్లో ఆ భర్త మరో కొత్త కాపురం.. చివరకు..!

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన మూడు రోజులకే మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడో ఘనుడు. అది కూడా లవ్ మ్యారేజ్ (Love Marriage). అలా మూడు రోజుల్లోనే రెండు పెళ్లిలు చేసుకున్న అతగాడు.. ఇద్దరిని ఒకే పట్టణంలో ఉంచడం కొసమెరుపు. అంతేనా.. కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇలా ఇద్దరు భార్యలను ఉంచడం మరో హైలైట్. అయితే, మొదటి భార్య దగ్గర అతడు చేసిన చిన్న తప్పు అసలుకే మోసాన్ని తెచ్చిపెట్టింది. దాంతో అతడి గుట్టురట్టయింది. బిహార్‌లో (Bihar) ఓ వ్యక్తి ఇలా మూడు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిలు చేసుకోవడం (Two Marriages in Three Days).. అతడి బండారం బయటపడడంతో ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే.. ముజఫర్‌పూర్‌కు (Muzaffarpur) చెందిన వికాస్ పాశ్వాన్‌కు గతేడాది ఏప్రిల్ 25న విద్యాజంప్‌కి చెందిన పుష్ప కుమారితో అతని కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించారు. అయితే, అప్పటికే మనోడు మరో అమ్మాయితో పీకలోతు ప్రేమలో ఉన్నాడు. ఆమె కూడా ఇతనిపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దాంతో వికాస్ తన ప్రేయసిని ఏప్రిల్ 28న పెళ్లాడాడు. అంటే.. మొదటి పెళ్లి జరిగిన మూడు రోజులకు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను తాను నివాసం ఉంటున్న దముచక్‌లోని (Damuchak) ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మరో ఇల్లును అద్దెకు తీసుకుని ఉంచాడు. ఇలా వారిద్దరి దగ్గర కొన్ని రోజులు మేనేజ్ చేశాడు. కానీ, మనోడి ఆర్థిక పరిస్థితి అంతంతా మాత్రమే కావడంతో అసలు సమస్య మొదలైంది. దాంతో వికాస్ పెళ్లయిన కొద్ది రోజులకే మొదటి భార్యను అదనపు కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు.

Viral News: పెళ్లి రోజు వేడుకలకు భార్యను స్టార్ హోటల్‌కు తీసుకెళ్తే షాకింగ్ సీన్.. ఇలా జరుగుతుందని ఆ భర్త కలలో కూడా ఊహించి ఉండడు..!


ఆమెను అదనపు కట్నంగా రూ.5లక్షలు తీసుకురావాలని వేధించసాగాడు. దాంతో ఆమెకు భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చింది. కొన్ని రోజులు గుట్టుగా భర్త బయటకు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అనేది గమనించింది. ఇంకేముంది.. మనోడు సెకండ్ ఫ్యామిలీ బయటపడడానికి ఎంతో సమయం పట్టలేదు. తాజాగా వికాస్‌ను రెండో భార్య దగ్గర ఉండగా బంధువులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మొదటి భార్య. అనంతరం కాజీ మహ్మద్‌పూర్ పోలీసులకు (Kazimohammedpur police) ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, రెండో భార్యతో అతడికి అప్పటికే ఓ కూతురు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Viral Video: ట్విటర్‌లో ఓ 5 ఏళ్ల బాలిక వీడియోను పోస్ట్ చేస్తూ ఆనంద్ మహీంద్రా షాకింగ్ కామెంట్స్.. నేను భయపడను అంటూనే..

Updated Date - 2023-04-26T12:26:31+05:30 IST